Thursday, April 25, 2024
- Advertisement -

విజయ్ దేవరకొండ మీద ఫైర్ అవుతున్న దిల్ రాజు

- Advertisement -

‘డియర్ కామ్రేడ్’ సినిమా విడుదలకు ముందు యువ హీరో విజయ్ దేవరకొండ తో ఒక సినిమా చేయాలని ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రయత్నించారు. ఇద్దరు దర్శకులతో కథ కూడా వినిపించాలని అనుకున్నారు కాని కారణాలు తెలియకపోయినా విజయ్ దేవరకొండ మాత్రం ససేమిరా ఒప్పుకోలేదు. ఈ మాట డైరెక్ట్గా చెప్పకుండా ఈరోజు వింటాను రేపు వెళ్తాను అంటూ ఎప్పటికప్పుడు ఎస్కేప్ అవుతూ వచ్చాడు. ఇదిలా ఉండగా విజయ్ దేవరకొండ మరో దర్శకుడితో సినిమా సైన్ చేయడంతో దిల్ రాజు కి బాగా కోపం వచ్చిందట. ఈ మధ్యనే విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు.

ఈ నేపథ్యంలో పూరి విజయ్ దేవరకొండ మరియు చార్మి ముగ్గురు కలిసి ఉన్న ఫోటోలు షేర్ చేస్తూ ఈ విషయాన్ని అధికారికంగా కూడా ప్రకటించారు. అయితే ఈ విషయంలో దిల్ రాజు మాత్రం చాలా కోపంగా ఉన్నారు. నిజానికి ‘డియర్ కామ్రేడ్’ సినిమా డిజాస్టర్ అయినప్పుడు విజయ్ దేవరకొండ కి దిల్ రాజు తప్ప మరొక ఆప్షన్ లేదు అని అందరూ అనుకున్నారు. విజయ్ కూడా దిల్ రాజు ఆఫీస్ వద్ద పలు సార్లు కనిపించాడు. కానీ ఏ విషయం బయటకు వచ్చే ముందే విజయ్ దేవరకొండ పూరితో సినిమా ప్రకటించారు. దాంతో దిల్ రాజు ఈ విషయం జీర్ణించుకోలేక పోతున్నారట. మరి వీరిద్దరి మధ్య తగాదా ఎప్పటికీ తీరుతుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -