Thursday, April 25, 2024
- Advertisement -

హాట్ హీరోయిన్ తో పూరి ఇస్మార్ట్ ప్రయోగం

- Advertisement -

పూరి జగన్నాథ్ దర్శకత్వం లో ఇటీవలే విడుదల అయిన చిత్రం ఇస్మార్ట్ శంకర్. ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో మన అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ సినిమా తర్వాత దర్శకుడు పూరి జగన్నాథ్ ఏ సినిమా చేయనున్నాడు అనే టాక్ అందరిలో ఉంది. కానీ పూరి ఏ సినిమా తో ప్రేక్షకుల వద్దకు రానున్నాడు అనే క్లారిటీ పూరి ఇవ్వలేదు. అయితే ఫిలిం నగర్ లో మాత్రం పూరి ఏం సినిమా చేయనున్నాడు అనే విషయం పై ఫుల్ గా చర్చ నడుస్తుంది.

కొన్ని కథనాల ప్రకారం పూరి త్వరలో ఒక ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడట. ఇస్మార్ట్ శంకర్ లో హీరోయిన్ గా చేసిన నభ నటేష్ తో ఈ సినిమా చేయాలి అని డిసైడ్ అయ్యాడట పూరి జగన్నాథ్. అయితే ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది అనే విషయం మీద మాత్రం ఇప్పటికీ ఒక క్లారిటీ లేదు. కాకపోతే నిజానికి ఈ సినిమా సెట్స్ పైకి అయినా టైం కి వెళ్తుందా లేదా అనేది డవుట్. ఈ సినిమా లో ఒక ప్రయోగాత్మక కథ ఉంది అని సమాచారం. చార్మీ ఎందుకో ఈ ప్రాజెక్ట్ ని పుష్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు అని టాక్.

ఈ సినిమా గురించిన మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -