అల్లు అర్జున్ పుష్ప ప్లేస్ మారబోతుందా…?

617
pushpa location changed
pushpa location changed

టాలీవుడ్ మెగా హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్  ప్రస్తుతం పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. సుకుమార్ దర్శకుడు.. రంగస్థలం లాంటి హిట్ కొట్టినా సుకుమార్ కి ఏదీ కలిసి రావట్లేదు.. అన్ని బాగుంటే ఇప్పటికే మహేష్ బాబు తో సినిమా చేసి రిలీజ్ చేయాల్సి ఉండేది. కానీ విధి ఆడిన నాటకంలో మహేష్ సుకుమార్ కి హ్యాండ్ ఇవ్వడం సుకుమార్ తనకు అచ్చోచ్చిన హీరో అయిన అల్లు అర్జున్ తో పుష్ప సినిమా చేయడం జరుగుతుంది. మరొవైపు నా పేరు సూర్య ఫ్లాప్ కావడంతో కొన్ని సినిమాలను కాదనుకుని మరీ త్రివిక్రమ్ తో అల వైకుంఠపురంలో సినిమా చేశాడు..

అలాంటి ఇండస్ట్రీ హిట్ సినిమా తర్వాత బన్నీ చేస్తున్న ఈ సినిమా పై అంచనాలు బాగానే ఉన్నాయి.. ఇక చాలా ఇబ్బందులనుంచి అన్నిటినుంచి తేరుకుని పుష్ప సినిమా ని మళ్ళీ మొదలుపెట్టారు.. ఇప్పటికే ఈ సినిమా కి విజయ్ సేతుపతి ని విలన్ గా ఫిక్స్ చేయగా డేట్ సమస్య వల్ల ఆయన ఈ సినిమా కి దూరమయ్యారు అనే వార్తలు వచ్చాయి..  దాంతో ధృవ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన అరవింద్ స్వామి ని పెట్టాలనుకున్న. కానీ అరవింద్ స్వామి కూడాఈ సినిమా చేయడానికి సముఖంగా లేదు.. దాంతో పరభాషల్లోని నటులకు వెళ్లడం ఎనుకని అనుకున్నారో ఏమో ఈ విలన్ పాత్ర కు యంగ్ హీరో నారా రోహిత్ ని పరిశీలిస్తున్నారట..

ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ ఎక్కువ భాగంగ అడవుల్లోనే జరగాల్సి ఉంది. అందుకోసం కేరళ ఫారెస్ట్‌లో భారీ షెడ్యూల్ ప్లాన్ వేయగా కరోనాతో బ్రేక్ పడింది.  అయితే ఈ సినిమా ని  మహబూబ్‌నగర్ జిల్లా అటవీ ప్రాంతాల్లో తెరకెక్కించాలని మళ్ళీ ప్లాన్ చేస్తున్నారట.. మరి ఈ భారీ మార్పు దేనికి దారి తీస్తుందో చూడాలి..

Loading...