టెంపర్ మూవీని ఆర్.నారాయణ మూర్తి ఎందుకు రిజెక్ట్ చేశాడంటే ?

1015
r narayana murthy reveals the reason behind rejecting temper movie
r narayana murthy reveals the reason behind rejecting temper movie

సినిమాల్లో హీరో, హీరోయిన్ల పాత్రలు ఎంత ముఖ్యమో.. సపోర్టింగ్ రోల్స్ కూడా అంతే ముఖ్యం. కొన్నిసార్లు ఈ సపోర్టింగ్ రోల్స్ వల్లే సినిమా హిట్ అవుతూ ఉంటుంది. ఉదహారణకు తీసుకుంటే.. ‘బాహుబలి’ లో సత్య రాజ్, రమ్యకృష్ణ, ‘మగథీర’ సినిమాలో శ్రీహరి, ‘కొత్త బంగారు లోకం’ సినిమాలో రావు రమేష్.. వంటి నటులు పోషించిన పాత్రలు అలా గుర్తిండిపోతాయి. ఈ కోవలోకే వస్తుంది ‘టెంపర్’ సినిమాలో మూర్తి పాత్ర.

టెంపర్ సినిమా అనగానే దయ పాత్ర ఎలా గుర్తు వస్తుందో.. అలానే మూర్తి పాత్ర కూడా అందరికి గుర్తుకు వస్తూ ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కమెడియన్ గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన పోసాని కృష్ణమురళితో ఈ సీరియస్ రోల్ ను చేయించాడు దర్శకుడు పూరి జగన్నాథ్. ఈ పాత్ర చేయడం వల్ల పోసానికి మంచి పేరు వచ్చింది అయితే ఈ పాత్ర కోసం ముందు గా ‘పీపుల్స్ స్టార్’ ఆర్.నారాయణ మూర్తిని అనుకున్నాడట దర్శకుడు పూరి.

కానీ ఆ పాత్ర చేయనని ఆర్ నాయరయణ మూర్తి అన్నాడట. ఈ విషయంపై ఆయననే క్లారిటీ ఇచ్చాడు. ‘నేను సమాజంలో చూసే కొన్ని లోటు పాట్లను సినిమాల ద్వారా ప్రజలకు తెలియజెయ్యాలని నేను ఇప్పటి వరకూ నటిస్తూ వచ్చాను. అంతేకాని డబ్బులు కోసం ఎప్పుడూ సినిమాలు చెయ్యలేదు. ‘టెంపర్’ సినిమాలో మూర్తి పాత్ర నాకు బాగా నచ్చింది. కానీ అలాంటి కమర్షియల్ సినిమాలో నటించే ఉద్దేశం లేదు. అందుకే ఆ పాత్రను రిజెక్ట్ చేశాను’ అని ఆర్ నారయణ మూర్తి చెప్పుకొచ్చాడు.

వారి పడకగదిలోకి వెళ్లనందుకే నన్ను వేధించారు : రవీనా టండన్

కుష్బూ నిన్ను రేప్ చేస్తా.. నటికి ఫోన్ చేసి బెదిరించాడు..!

నేను నా ఫ్రెండ్ ఒక అమ్మాయిని ప్రేమించి గొడవ పడ్డాం : సాయి ధరమ్…

పెళ్లి చేసుకుని.. నా లైఫ్ లో పెద్ద తప్పు చేశా : ప్రగతి ఆంటీ

Loading...