Saturday, April 20, 2024
- Advertisement -

16 ఏళ్లు వయసులో అలా జరిగింది : రాశీఖన్నా

- Advertisement -

రాశీఖన్నా.. ఈ ముద్దుగుమ్మ అందం, అభినయంతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గర అయింది. తాజాగా, ప్రతీరోజు పండగే, వెంకీ మామ చిత్రాల విజయాలను తన ఖాతాలో వేసుకుంది. అయితే తాజాగా తన బాయ్‌ఫ్రెండ్‌తో ఫస్ట్ డేటింగ్ అనుభవాన్ని చెప్పింది. నాకు అప్పుడు 16 ఏళ్లు. ఆ టైంలో నాకు బాయ్‌ఫ్రెండ్ ఉండేవాడు.

అతడి బర్త్ డే రోజు నన్ను పార్టీకి పిలిచాడు. ఆ పార్టీకి నేను వెళ్లడంతో హ్యాపీగా ఫీలయ్యాం. మేమిద్దరం మెక్‌డొనాల్డ్‌కు వెళ్లాం. అయితే ఆ సమయంలో దానిని డేటింగ్ అంటారనే విషయం కూడా నాకు తెలియదు అని రాశీఖన్నా పేర్కొన్నారు. మెక్‌డొనాల్డ్‌కు వెళ్లాక నాకు కావాల్సిందేదో ఆర్డర్ ఇచ్చుకొన్నాను. అతడిని పట్టించుకోకుండా నా మట్టుకు నేను తింటూ ఉన్నాను. మధ్య మధ్య అతడిని చూస్తూ స్మైలిస్తూ తింటున్నాను. అలా నా ఫస్ట్ డేటింగ్ జరిగింది. మా మధ్య వచ్చిన అభిప్రాయ భేదాల వల్ల బ్రేక్ ఇచ్చాను.

కాకపోతే ఇప్పటికి మేమిద్దరం ఫ్రెండ్స్ మాదిరిగానే ఉంటాం. తర్వాత సినిమాలవైపు వచ్చి బిజీ అయిపోయాను. ప్రస్తుతం ప్రేమ, పెళ్లి ఆలోచనలేదని రాశీ ఖన్నా చెప్పింది. ఇక కాబోయే భర్త పొడుగ్గా ఉండాలని.. ఎందుకంటే నా హైట్ ఎక్కువ కాబట్టి నా ఎత్తుకు తగినట్టు ఉండాలి. అంతకంటే ఎక్కువ ఏమీ డిమాండ్లు లేవని రాశీఖన్నా చెప్పారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -