Friday, April 19, 2024
- Advertisement -

ప్రభాస్ ‘రాధే శ్యామ్’ ఫస్ట్ లుక్ అదిరింది..!

- Advertisement -

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎన్నాళ్ళుగానో వేచి చూస్తున్న టైం వచ్చేసింది. ప్రభాస్ కెరీర్ లో 20వ సినిమాగా తెరకెక్కుతున్న మూవీకి ‘రాధే శ్యామ్’ అనే టైటిల్ ఖరారు చేసారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు ‘రాధే శ్యామ్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది మూవీ యూనిట్. ఈ ఫస్ట్ లుక్ లో ప్రభాస్, పూజా హెగ్దే లను చూస్తుంటే.. ఈ పక్కా లవ్ స్టోరీ లా కనిపిస్తోంది. ‘రాధే శ్యామ్’ టైటిల్ చూస్తుంటే ఈ సినిమా ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ ని కూడా టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమాకి ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. రెబర్ స్టార్ కృష్ణంరాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్ మరియు గోపీకృష్ణ మూవీస్ టీ సిరీస్ వారు కలిసి సంయుక్తంగా భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇక మనోజ్ పరమహంస డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా వ్యవహరిస్తుండగా కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో ‘రాధే శ్యామ్’ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనేది మాత్రం ప్రకటించలేదు. పాన్ ఇండియా మూవీ కావడంతో పలువురు ఇతర భాషల నటీనటులు కూడా ‘రాధే శ్యామ్’ లో యాక్ట్ చేస్తున్నారు.

సీనియర్ నటి భాగ్యశ్రీ స్టార్ కమెడియన్ ప్రియదర్శి తమిళ నటుడు సత్యన్ మలయాళ నటుడు సచిన్ ఖేడేకర్ ఎయిర్టెల్ యాడ్ ద్వారా పాపులరైన షాషా ఛత్రి బాలీవుడ్ నటుడు కునాల్ రాయ్ కపూర్ ప్రముఖ నటుడు మురళి శర్మ సహా మరికొందరు ఇతర తారాగణం ఈ సినిమాలో కనిపిస్తున్నారు. లవ్ అండ్ రొమాంటిక్ మూవీగా తెరక్కుతున్న ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీ తమిళ్ మలయాళ భాషల్లో 2021 లో థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నారు. ‘రాధే శ్యామ్’ ఫస్ట్ లుక్ పోస్టర్ కి అన్ని వర్గాల నుంచి మంచి స్పందన వస్తోంది.

పవర్ స్టార్ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన వర్మ..!

హీరోయిన్ ని ముద్దులతో ముంచెత్తిన వర్మ..!

ప్రముఖ నటి, ఎంపీ సుమలతకు కరోనా పాజిటివ్..!

మరో యాంకర్ ని ఆకాశానికి ఎత్తిన వర్మ.. చూస్తే షాక్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -