ఫ్లాప్ నిర్మాత కి ఊరట నిచ్చిన లారెన్స్ సినిమా.

187
Raghava Lawrence Kanchana 3 Box Office Collections
Raghava Lawrence Kanchana 3 Box Office Collections

రాఘవ లారెన్స్ ప్రధాన పాత్ర లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించబడ్డ చిత్రం కాంచన 3. ఇటీవలే విడుదలై ఈ సినిమా ఊహించని విధంగా చాలా పెద్ద విజయాన్ని సాధించింది. తమిళం తో పాటు తెలుగు లో ఓకే రోజు రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగు లో జెర్సీ కి గట్టి పోటీనే ఇచ్చింది అని చెప్పుకోవచ్చు. చాలా ఏరియాల లో జెర్సీ కన్నా కాంచన 3 కి వచ్చిన వసూళ్లే ఎక్కువ.

అయితే ఈ సినిమా ను తెలుగు లోకి విడుదల చేసిన టాగోర్ మధు చాలా ప్రాఫిట్స్ తన ఖాతా లో వేసుకున్నట్లు తెలుస్తుంది. తను పెట్టుబడి పెట్టిన దానికి మించి ఊహించనంత డబ్బు టాగోర్ మధు కు లాభాల్లోకి వచ్చి చేరింది అట.

వరుస పరాజయాల తో ఉన్న టాగోర్ మధు కు కాంచన 3 విజయం ఒక పెద్ద ఊరట అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం లారెన్స్ ఒక కొత్త ప్రాజెక్ట్ లైన్ లో పెట్టే పని లో బిజీ గా ఉన్నాడు.

Loading...