విడుద‌ల తేదీని ఫిక్స్ చేసుకున్న కాంచ‌న -3

225
Raghava Lawrence's Kanchana 3 Release Date Out
Raghava Lawrence's Kanchana 3 Release Date Out

రాఘవ లారెన్స్ .. న‌టుడుగా, ద‌ర్శ‌కుడుగా, డ్యాన్స్ మాస్ట‌ర్‌గా త‌న‌కంటు ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. కాంచ‌న సిరీస్‌తో తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కుల‌పై త‌న‌దైన ముద్ర వేశాడు రాఘవ లారెన్స్. ముని, కాంచ‌న‌, గంగా సినిమాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఎంత‌టి సంచ‌ల‌న విజ‌యాల‌ను సాధించియో అంద‌రికి తెలిసిందే. తాజాగా ఈ సిరీస్ నుంచి మ‌రో సినిమాను రెడీ చేశాడు రాఘవ లారెన్స్.

కాంచ‌న -3 పేరుతో తెర‌కెక్కిన ఈ సినిమాను తెలుగులో కూడా అదే పేరుతో విడుద‌ల చేస్తున్నారు. మొద‌టి మూడు పార్ట్‌ల‌కు మాదిరిగానే ఈ సినిమాకు కూడా స్టోరీ లైన్ సేమ్ రివెంజ్ డ్రామా అప్డేటెడ్ కామెడీ. తాజాగా ఈ సీక్వెల్ సినిమా విడుద‌ల తేదీని ఫిక్స్ చేశారు. “కాంచన 3″ ఏప్రిల్ 19న విడుదల కానుంది.మరి ఈ సినిమా కూడా ముందు సినిమాల్లా రొటీన్ గా ఉంటుందో లేక లారెన్స్ ఏమన్నా కొత్తదనాన్ని కలిపారో చూడాలి. ఈ సినిమాలో రాఘవ లారెన్స్ మూడు విభిన్న పాత్ర‌ల్లో న‌టిస్తున్నాడ‌ని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం రాఘవ లారెన్స్ వ‌హిస్తున్నారు. థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు.