హౌస్ లో కొట్టుకున్న రాహుల్, వరుణ్.. ఎందుకు ?

770
rahul and varun become violent in the task
rahul and varun become violent in the task

ఆసక్తికరంగా సాగుతున్న బిగ్ బాస్ నుంచి తాజాగా వితికా ఎలిమినేట్ అయింది. ఆమె వెళ్లిపోవడంతో వరుణ్ తెగ ఏడ్చాడు. అంతకు ముందు ఇంటి సభ్యులతో సరదా ఆటలు ఆడించాడు హోస్ట్ కింగ్ నాగార్జున. అయితే బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియడం లేదు. గత ఎపిసోడ్ ల్లో రాహుల్, శ్రీముఖి మధ్య పెద్ద వాగ్వాదమే జరిగింది. వీరిద్దరు ఒకరికి ఒకరు శత్రువులు అయ్యారు.

ఇక వీరి గురించి సోషల్ మీడియాలో శ్రీముఖి పై రాహుల్ ఫ్యాన్స్.. రాహుల్ పై శ్రీముఖి ఫ్యాన్స్ కామెంట్స్ చేసుకుంటున్నారు. వితికా విషయంలో శివజ్యోతితో వరుణ్ గొడవ పడ్డ సంఘటన కూడా మనం చూశాం. ప్రస్తుతం ఉత్కంఠంగా సాగుతున్న బిగ్ బాస్ లో ఎవరు విన్నర్ అవుతారు అనేది చెప్పడం కాస్త కష్టంగానే ఉంది. ఎందుకంటే ఎవరికి వారు హైలెట్ గా గేమ్ ఆడుతున్నారు. అయితే తాజాగా బిగ్ బాస్ ప్రోమ్ ఒకటి రిలీజ్ అయింది.

ఈ ప్రోమోలో టిక్కెట్ టు ఫినాలే అనే టాస్క్ లో రాహుల్, వరుణ్ ఒకరు మీద ఒకరు పడుతూ.. బొర్లుకుంటూ కింద పడి మరి కొట్టుకున్నారు. ఈ ప్రోమో చూస్తుంటే ఇద్దరి మధ్య గొడవ పెద్దగా అయ్యేలానే ఉంది. ఎందుకంటే వయోలెన్స్ ఆ రెంజ్ లో కనిపిస్తోంది. ఇద్దరు వారి బలాలను చూపిస్తూ రెచ్చిపోయారు.

Loading...