తన సినిమాలపై ఆ ప్రభావం ఉండదు అంటున్న రాహుల్ రవీంద్రన్

766
Rahul Ravindran Shocking Comments on Chinmayi Sripada
Rahul Ravindran Shocking Comments on Chinmayi Sripada

‘చి ల సౌ’ సినిమాతో దర్శకుడిగా మారిన రాహుల్ రవీంద్రన్ రెండవ సినిమాతోనే సీనియర్ హీరో అక్కినేని నాగార్జున తో కలిసి ‘మన్మధుడు 2’ అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ తీసే అవకాశాన్ని దక్కించుకున్నాడు. అయితే తాజాగా విడుదలైన ఈ చిత్ర టీజర్ మరియు ట్రైలర్లు ప్రేక్షకుల నుంచి నెగటివ్ రెస్పాన్స్ అందుకుంటున్నాయి. 60 ఏళ్ళు ఉన్న నాగార్జు 20 లో ఉన్న రకుల్ ప్రీత్ రొమాన్స్ చేయడం ఏమిటని కొందరు సినిమా పై దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ హీరో గా నటించిన కొన్ని సినిమాలను కూడా లాక్కొచ్చి సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ రవీంద్రన్ భార్య చిన్మయి శ్రీపాద కూడా పలుసార్లు వివాదాల్లో దిగిన సంగతి తెలిసిందే.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాహుల్ రవీంద్రన్ దీనిపై క్లారిటీ ఇచ్చాడు. తన భార్యను పూర్తిగా సపోర్ట్ చేస్తాను అని సోషల్ మీడియా లో జరిగే గొడవలు తన సినిమా మరియు స్క్రిప్ట్ విషయంలో కానీ ఎలాంటి మార్పు ప్రభావం చూపించదని కుండబద్దలు కొట్టాడు. అంతేకాకుండా తను క్యారెక్టర్ డిమాండ్ని బట్టి స్క్రిప్ట్ రాస్తాను కానీ ట్రోల్స్ ని పట్టించుకోని అని చెప్పాడు. ఒక మంచి ఎంటర్టైనింగ్ సినిమా తీయాలంటే ఇలాంటి ట్రోలింగ్ నీ పట్టించుకోకూడదు అని అంటున్న రాహుల్ రవీంద్రన్ తనను ఎవరూ జడ్జి చేయకపోతే బాగుంటుంది కానీ సెలబ్రిటీ అవ్వడం లో వచ్చే సైడ్ ఎఫెక్ట్ అదే అంటున్నాడు. ‘మన్మధుడు 2’ సినిమా ఆగస్టు 9న విడుదలకు సిద్ధమవుతోంది.

Loading...