Saturday, April 20, 2024
- Advertisement -

రాహుల్, పునర్నవి పెళ్లి పిక్స్.. ఎప్పుడు ?

- Advertisement -

తెలుగు బిగ్ బాస్ మూడో సీజన్ విన్నర్ గా సింగర్ రాహుల్ సిప్లిగంజ్ నిలిచిన విషయం తెలిసిందే. అయితే బిగ్ బాస్ హౌస్ లో రాహుల్ బాగా హైలైట్ కావడానికి మరో కంటెస్టెంట్ పునర్నవి బాగా హెల్ప్ అయిందని చెప్పాలి. కొన్ని టాస్క్ ల విషయంలో రాహుల్ ను పునర్నవి బాగా బూస్ట్ చేసి ఆడమని ప్రోత్సహించేది. అలా వీరిద్దరి మధ్య మంచి రిలేషన్ ఏర్పడింది.

ప్రేమికులుగా హౌస్ లో వీరు ఉండేవారు. నాగార్జున కూడా ఏ మాత్రం సమయం దొరికినా వీరీద్దరి మధ్య ఏదో ఉందని డౌట్ చేస్తూ ఉండేవారు. అలా ప్రేక్షకులకు కూడా వీరిద్దరి మధ్య ఏదో ఉందని పసిగట్టారు. వీరిద్దరి వల్ల టిఆర్పీ రేటింగ్ కూడా బాగా పెరిగింది. ఎలిమినేట్ అయ్యి బయటకు పునర్నవి వచ్చిన సందర్భంలో కూడా రాహుల్ బాగా ఏడ్చాడు కూడా. అలా వీరిద్దరు ప్రేమించుకుంటున్నారా ? అన్నంత సందేహాలు వచ్చాయి. అయితే మాముల్ గా టాస్క్ లు చేసే రాహుల్.. పునర్నవి బయటకు వచ్చాక అసలైన ఆటగాడిలా విజృంభించాడు.

ఇక రాహుల్ బిగ్ బాస్ విన్నర్ అయ్యాక పునర్నవికి కూడా గ్రాండ్ పార్టీ ఇచ్చాడు. ఇక రాహుల్, పునర్నవి పెళ్లికి ఓకే అంటే తాము కూడా పెళ్లి చేసేందుకు రెడీగా ఉన్నామని రాహుల్ పేరెంట్స్ అంటున్నారు. పునర్నవికి పార్టీ ఇస్తున్న క్రమంలో వీరిద్దరి పెళ్లిపై రాహుల్ తల్లిదండ్రులు ఓపెన్ కావడంతో ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి నెలకొంది. మరి ఈ బిగ్ బాస్ ప్రేమికులు నిజంగానే పెళ్లి పీటలు ఎక్కుతారా ? లేదా ? అన్నది చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -