Thursday, April 25, 2024
- Advertisement -

పునర్నవిని పార్ట్‌నర్‌ను చేసుకుంటున్నా : రాహుల్

- Advertisement -

రాహుల్, పునర్నవి ప్రేమలో ఉన్నారని.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని రకరకల వార్తలు ఇప్పటికి వస్తునే ఉన్నాయి. ఇందుకు గల కారణం బిగ్ బాస్ హౌస్‌లో వ్యవహరించిన తీరే. తాజాగా వీళ్లిద్దరి గురించి ఓ ఆసక్తికరమైన వార్త వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. రాహుల్ బిగ్ బాస్ విన్నర్ గా గెలుపొందడం వెనుక పునర్నవి ఉందని అందరికి తెలిసిందే. వీరు హౌస్ లో ఉన్న సమయంలో చాలా క్లోజ్ గా ఉన్నారు.

అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అలానే బయట కూడా రాహుల్ కి మంచి సపోర్ట్ లభించి విన్నర్ గా నిలిచాడు. బిగ్ బాస్ హౌస్‌లో పునర్నవి – రాహుల్ ఎంతగా హాట్ టాపిక్ అయ్యారో.. షో పూర్తయ్యాక కూడా అంతే స్థాయిలో వార్తల్లో నిలుస్తున్నారు. దీనికి కారణం వీళ్లిద్దరూ తరచూ ఏదో ఒక చోట కలవడం.. జంటగా టీవీ షోలకు వెళ్లడం.. ఇంటర్వ్యూలు ఇవ్వడం ద్వారా ప్రేక్షకులను పలకరిస్తున్నారు. తాజాగా రాహుల్ ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చాడు.

ఈ సందర్భంగా కీలక ప్రకటన చేశాడు. ‘నేను ఇండిపెండెంట్ సింగర్‌గా పేరు సంపాదించుకోవాలని అనుకుంటున్నా. ఇందులో భాగంగానే త్వరలో ఓ సాంగ్ చేస్తున్నా. ఇందులో పునర్నవిని పార్ట్‌నర్‌ను చేసుకుంటున్నా. బయట అందరూ మా పెయిర్ బాగుందని అంటున్నారు. అందుకే ఆమెను తీసుకుంటున్నా’ అని అతడు వెల్లడించాడు. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో సినిమాని నిర్మించేందుకు ఓ యంగ్ నిర్మాత ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇందుకోసం ఓ యంగ్ డైరెక్టర్ ను పట్టాడాడట ఆ నిర్మాత. మరి రాహుల్, పునర్నవి కాంబోలో సినిమా ఎప్పుడు వస్తుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -