Friday, April 26, 2024
- Advertisement -

పునర్నవి నన్ను కొరికింది : రాహుల్

- Advertisement -

తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 ఈ వారంలోనే కంప్లీట్ కాబోతుంది. ప్రస్తుతం హౌస్ లో రాహుల్, బాబా భాస్కర్, శ్రీముఖి, వరుణ్ మరియు అలీ ఉన్నారు. ఈ ఐదుగురిలో ఒకరు ఈ సీజన్ టైటిల్ విన్నర్ కాబోతున్నారు. ఇక తాజాగా ఎపిసోడ్ ను మీకు మాత్రమే చెప్తా సినిమా ప్రమోషన్ తో ఎంటర్ టైన్ చేశారు. బిగ్ బాస్ హౌస్ లోకి విజయ్ దేవరకొండ వెళ్లి అందర్ని ఆశ్చర్యపరిచాడు.

మీకు మాత్రమే చెప్తా అంటూ ఒక సీక్రెట్ ను నాతో చెప్పండి అంటూ ఇంటి సభ్యుల నుంచి రహస్యాలను బయటకు లాగే ప్రయత్నం చేశాడు. ఫస్ట్ బాబా భాస్కర్ ను వేసేయాలని ఉందంటూ శ్రీముఖి చెప్పుకొచ్చింది. తానే విన్నర్ ను అంటూ యాటిట్యూడ్ చూపిస్తున్నాడంటూ చెప్పింది. శివజ్యోతి రహస్యం చెబుతూ.. తనకు శ్రీముఖి విన్నర్ అవ్వడం ఇష్టం లేదంది.

ఇక రాహుల్ అందరికంటే చాలా విభిన్నంగా ఒక సీక్రెట్ చెప్పాడు. కాకరకాయ జ్యూస్ తాగి పునర్నవిని సేవ్ చేసిన టైంలో ఆమె ముద్దు పెట్టింది. అది అందరు చూసి ఉంటారు. కానీ ఆమె ఒకసారి నా చేయి గట్టిగా కొరికి పారిపోయింది. చేయి కొరికి పారిపోయిన విషయంను రాహుల్ చెప్పడంతో హోస్ట్ నాగార్జున గట్టిగా నవ్వారు.

ఇది అందరు చెప్పిన రహస్యాల కంటే పెద్ద రహస్యం అన్నాడు. ఇక రాహుల్, పునర్నవిల మధ్య ఏదో ఉందని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజా ఎపిసోడ్ లో మా ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉందని రాహుల్ మరోసారి చెప్పాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -