Thursday, April 25, 2024
- Advertisement -

పున్నర్నవితో అవకాశం వస్తే వదలను : రాహుల్

- Advertisement -

తెలుగు బిగ్ బాస్ ముడో సీజన్ విజేతగా రాహుల్ సిప్లిగంజ్ నిలిచాడు. ఆయన ప్రస్తుతం పలు టీవీ ఛానెల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. నిజానికి హౌస్ లో రాహుల్ పెద్దగా టాస్క్ లు ఆడలేదు కానీ.. అతని వ్యక్తిత్వం బాగుండటం.. అతని మాటలు ప్రేక్షకులకు నచ్చడం వల్ల ప్రతి వారం నామినేషన్ లో ఉన్నప్పటికి సేవ్ అవుతూ వచ్చాడు.

ఇక హౌస్ లో రాహుల్, పునర్నవి బాగా హైలైట్ అయ్యారు. వీరి మధ్య లవ్ ఉందని కొన్ని ఎపిసోడ్స్ చూస్తే అర్దం అవుతోంది. అయితే పునర్నవి చాలా సార్లు నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని రాహుల్ తో చెప్పింది. అయిన పునర్నవి చెప్పిన మాటలు వినకుండా ఆమెతో క్లోజ్ గా ఉన్నాడు రాహుల్. ఇక బిగ్ బాస్ విజేతగా రాహుల్ ప్రకటించిన తర్వాత పునర్నవి గురించి రాహుల్ చాలా సార్లు చెప్పాడు. మేము కేవలం ఫ్రెండ్స్ మాత్రమే.. ఎలాంటి లవ్, డేటింగ్ లేవని చెప్పాడు.

ఇక తాజాగా పునర్నవితో ఓ సినిమాలో ఛాన్స్ వస్తే నటిస్తారా అని ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించగా… అందుకు రాహుల్ ఏం మాత్రం తడబడకుండా కచ్చితంగా అని చెప్పాడు. అలాంటి ఛాన్స్ వస్తే వదిలిపెట్టను అని చెప్పాడు. మరి వీరి కాంబోలో సినిమా వస్తుందేమో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -