Thursday, March 28, 2024
- Advertisement -

డ్రంక్ అండ్ డ్రైవ్ వివాదం నుండి బయటపడ్డ రాజ్ తరుణ్

- Advertisement -

ఈ మధ్యకాలంలో రాజ్ తరుణ్ పేరు సినిమాల పరంగా కంటే వివాదాల వల్ల ఎక్కువగా హైలైట్ అవుతుంది. ఈ మధ్యనే ఒక కార్ యాక్సిడెంట్ కేస్ లో ఇరుక్కున్న రాజ్ తరుణ్ సోషల్ మీడియాలో బాగానే వినిపిస్తోంది. నర్సింగి వద్ద రాజ్ తరుణ్ తన కారుతో ఒక గోడ ని గుద్దేశాడు. ఆ వీడియో ఇంటర్నెట్లో వైరల్ గా మారింది. ఇక ఈ వార్తలపై బోలెడు పుకార్లు కూడా బయటకు వచ్చాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పోలీసులు రాజ్ తరుణ్ ని అరెస్ట్ చేశారని కొందరు పుకార్లు సృష్టించారు. అయితే తాజాగా తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా రాజ్ తరుణ్ తన ఫోటోని షేర్ చేస్తూ ఇండైరెక్టుగా తాను జైలుకు వెళ్ళలేదు అంటూ హింట్ ఇచ్చాడు.

నిజానికి రాజ్ తరుణ్ ఒక గోడను గుద్దడం వీడియోలో క్లియర్ గా కనిపించింది. మొదట రాజ్ తరుణ్ కార్ లో ఉన్నది తాను కాదని అంటూ ఎంత బుకాయించినా తర్వాత వీడియోలో ఆ కార్ లో ఉన్నది తానేనని, కారు తో గోడని గుడ్డేసిన తర్వాత నుంచి కార్ నుండి దిగిపోయి రోడ్డుమీద పరిగెత్తుకుంటూ వెళ్ళి పోయాడు అని క్లియర్ గా తెలుస్తోంది. రాజ్ తరుణ్ సన్నిహితులు ఆ వీడియో రికార్డు చేసిన అతనికి ఏదో ఒకటి ఇచ్చి వీడియో ని డిలీట్ చేయాలని కూడా అనుకున్నారు. ఏదేమైనా ఆ వీడియో మాత్రం ఇంటర్నెట్లో బాగానే చక్కర్లు కొట్టింది. తాజాగా రాజ్ తరుణ్ ఇంస్టా లో పెట్టిన ఫోటో చూస్తుంటే ఈ వివాదం వేడి తగ్గిపోయినట్లు కనిపిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -