Friday, March 29, 2024
- Advertisement -

బాక్సాఫీస్ వ‌ద్ద‌ క‌లెక్ష‌న్స్‌ ను కొల్ల‌గొడుతున్న‌అంద‌గాడు మూవీ

- Advertisement -
Raj Tarun’s Andhagadu movie first day collections

టాలీవుడ్‌లో యువ‌క‌థానాయ‌కుడు రాజ్ త‌రుణ్‌…హీరోయిన్ హెబ్బాప‌టేల్ జోడికి హిట్ పేయిర్ అన్న పేరుంది. గ‌తంలో ఈజంట న‌టించిన ఆడోర‌కం-ఈడోర‌కం, కూమారి 21F సినిమాలు సూప‌ర్‌హిట్ అయ్యాయి.

ప్ర‌స్తుతం తాజాగా రాజ్ త‌రుణ్ హీరోగా .కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌లో వెలిగొండ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో రామ‌బ్ర‌హ్మం సుంక‌ర నిర్మించిన హిలేరియ‌స్ ఎంట‌ర్‌టైన‌ర్ `అంధ‌గాడు మూవీ స‌క్సెస్‌లో దూసుకుపోతోంది.అలాగే హిట్‌పెయిర్ రాజ్‌ర‌తుణ్‌, హెబ్బా ప‌టేల్‌కు కూడా హ్యాట్రిక్ మూవీగా నిలిచింది.
సినిమా ప్రారంభం నుండి పాజిటివ్ టాక్ సంపాదించుకున్న ఈ సినిమా విడుద‌లైన ఆట నుండే బాక్సాఫీస్ వ‌ద్ద మంచి క‌లెక్ష‌న్స్‌న్‌ల‌లో దూసుకుపోతోంది. తొలిరోజు 3.75 కోట్ల రూపాయ‌ల‌ను వ‌సూలు చేసిన `అంధ‌గాడు` రాజ్‌త‌రుణ్ కెరీర్‌లోనే హయ్య‌స్ట్ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ సాధించిన చిత్రంగా నిలిచింది.

{loadmodule mod_custom,GA2}

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ కూడా అంధ‌గాడు చిత్రాన్ని చూసి అందులో రాజ్‌త‌రుణ్ న‌ట‌న‌ను, సినిమాలో ట్విస్టులు ఎంతో బావున్నాయ‌ని అప్రిసియేట్ చేశారు.
ర‌చ‌యిత వెలిగొండ శ్రీనివాస్ ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా మారారు. సినిమాలో కామెడి, సెంటిమెంట్‌, ఎమోష‌న్స్‌, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మేజ‌ర్ హైలెట్‌గా రూపొందిన ఈ చిత్రం సాధిస్తున్న క‌లెక్ష‌న్స్ చూస్తుంటే డెఫ‌నెట్‌గా `అంధ‌గాడు` చిత్రం రాజ్‌త‌రుణ్ కెరీర్‌లో బిగ్గెస్ట్‌హిట్‌గా నిలుస్తుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి.

{loadmodule mod_sp_social,Follow Us}

Related

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -