Friday, March 29, 2024
- Advertisement -

శ్రీరాముడిపై రాజమౌళి కామెంట్స్.. పబ్లిక్ లో రచ్చా..!

- Advertisement -

రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన బాహుబలి సినిమాను ఇటీవలే లండన్ లోని ప్రఖ్యాత రాయల్ ఆల్బర్ట్ లో ప్రదర్శించారు. ఈ ప్రదర్శనకు రాజమౌళి- ప్రభాస్- అనుష్క- రానా- కీరవాణి హాజరయ్యారు. ఇక లండన్ మీడియా నుంచి జక్కన్నకు ఆసక్తికర ప్రశ్నలు ఎదురవ్వగా అంతే ఆసక్తికరంగా జవాబులు ఇచ్చారు జక్కన్న. ఈ సందర్భంగా ఆయన అమరేంద్ర బాహుబలి పాత్రను శ్రీరాముడితో పోల్చాడు. ఆ పాత్రలో అన్ని రాముడి లక్షణాలే ఉంటాయి.

ఇక శ్రీకృష్ణుడి తో శ్రీరాముడి పాత్రను పోల్చితే కమర్శియల్ సినిమాలకు శ్రీకృష్ణుడి కథ అయితేనే బాగుంటుందన్నాడు. శ్రీరాముడు జీవితంలో ఒకే భార్య.. కానీ శ్రీకృష్ణుడి కి ఎంత మంది భార్యలో అందరికి తెలుసు. రాముడి లైఫ్ ఒక్క భార్యతో బోరింగ్ గా ఉంటుంది. కానీ కృష్ణుడి జీవితంలో 20 మంది గోపికలతో ఎన్నో ఆసక్తికర విషయాలు ఉంటాయి. శ్రీరాముడు తండ్రి మాట జవదాటడు. సున్నితమైన మనస్కుడు. ఇవేవి మన కమర్శియల్ సినిమాలకు సరిపోవు. అందుకే శ్రీకృష్ణుడి కథ గమ్మత్తుగా ఉంటుంది. శ్రీకృష్ణుడికి ఎక్కువ గోపురాలు ఉండవు కానీ రాముడికి గుళ్లు ఎక్కువగా ఉంటాయి అని చెప్పారు.

అందుకే రామాయణం రాసేటప్పుడు రాముడు పక్కన లక్ష్మణుడు. అంజనేయుడు లాంటి మాస్ పాత్రలు మాత్రం అద్భుతంగా రాశారు. వాళ్లిద్దరు రాముడు కోసం ప్రాణాలిచ్చిన పరాక్రమవంతులు. ఆ విషయంలోనే రాముడికి అంతా బాగా కనెక్ట్ అయిపోయాం. శ్రీరాముడ్ని ఎవరన్నా ఓ మాట అంటే ఒప్పుకోం. కానీ శ్రీ కృష్ణుడిని అంటే లైట్ తీసుకూంటాం. బాహుబలి పక్కన అంజనేయుడిలా కట్టప్ప పాత్ర ఉండటం వల్ల ఆ పాత్రకు అందరూ బాగా కనెక్ట్ అయ్యారని చెప్పారు. అయితే పురాణాలను కమర్షియల్ సినిమాలకు రాజమౌళి లింక్ చేయడం సరికాదంటూ హిందూ వర్గాలు మండి పడుతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -