Friday, March 29, 2024
- Advertisement -

ప్రభాస్ వెర్రిబోగులోడిలా కనిపిస్తాడు : రాజమౌళి

- Advertisement -

రాజమౌళికి, ప్రభాస్‍కి మంచి అనుభంధం ఉంది. అందుకే ప్రభాస్ తో రాజమూళీ ఏకంగా మూడు చిత్రాలు చేశాడు. చత్రపతి బాహుబలి1 బాహుబలి2తో ఏకంగా ఇండస్ట్రీ హిట్ లు వచ్చాయి. దీంతో ప్రభాస్ ప్యాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. ప్రభాస్ ఎదుగుదలకు ఇంతలా తోడ్పడ్డ రాజమౌళి తాజా ఇంటర్వ్యూలో డార్లింగ్ ప్రభాస్ పై ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

రాజమౌళి మాట్లాడుతూ.. “ప్రభాస్ పైకి చూడడానికి ఓ వెర్రిబోగులోడిలా కనిపిస్తాడు.. ఆ డార్లింగ్ అంటూ ఏమీ ఎరుగని వాడిగా..అమాయకుడిలా కనిపిస్తాడు.. కానీ లోపల చాలా మేధావి. మనుసులను ఎవరు ఎలాంటి వారు? వారితో ఎలా ఉండాలి? అనే విషయాలు బాగా తెలిసిన గొప్ప మానసికవేత్త’ అంటూ ప్రభాస్ గురించి గొప్పగా చెప్పాడు.

ప్రభాస్ కు అన్ని విషయాలపై లోతైన అవగాహనం ఉంటుందని.. అతనో ఫిలాసఫర్ అని రాజమౌళి కొనియాడారు. ఇక రాంచరణ్ – ఎన్టీఆర్ నటనను కూడా రాజమౌళి ఆకాశానికెత్తేశాడు. వారిలో అద్భుతమైన నటనాచాతుర్యం ఉందని.. సింహాద్రిలో ఎన్టీఆర్ ని.. మగధీర లో రామ్ చరణ్ ల నటన చూసి తానే షాక్ అయినట్లు రాజమౌళి తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -