పవన్ తో సినిమా చేయలేను : రాజమౌళి

365
rajamouli opens up on pawan kalyan
rajamouli opens up on pawan kalyan

రాజమౌళి ఏ హీరోతో సినిమా చేసిన అది బ్లాక్ బస్టర్ అనే నమ్మకం అందరిలో ఉంది. అయితే రాజమౌళి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ఇనిమా వస్తే బాగుంటుందని పవన్ అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఆరటపడ్డారు. అయితే ఆయనతో కలిసి సినిమా తీసే ఛాన్సు లేదని రాజమౌళి అన్నారు. లాక్ డౌన్ వల్ల ప్రస్తుతం అన్ని సినిమా షూటింగులు ఆగిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాజమౌళి పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు.

ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పవన్‌తో సినిమా చేయడంపై స్పందించారు. ‘పవన్ కల్యాణ్‌తో సినిమా తీయాలనుకున్నాను.. ఈ విషయంలో ఆయనను గతంలో కలిశాను.. కానీ, కుదరలేదు. ఆయన మళ్లీ సినిమాలు చేస్తున్నారు. కానీ, ఆయన దృక్పథం అంతా వేరేలా ఉంది. ప్రజాసేవ వంటి వాటిపై ఉంది. సినిమాలకు సమయం తక్కువగా కేటాయించే అవకాశం ఉంటుంది’ అని చెప్పారు.

‘మరోవైపు, నేనేమో రోజుల కొద్దీ సినిమాలు (ఆలస్యంగా) తీస్తుంటాను. పవన్‌తో సినిమా తీసే అవకాశం లేదు. సమాజం పట్ల బాధ్యత కానీ, సమాజానికి ఏదైనా చేయాలన్న కసిగానీ పవన్‌ కల్యాణ్‌లో 100 శాతం ఉంటే.. నాలో మాత్రం 0.5 ఉంటుంది. ఆయన దృక్పథాన్ని నా దృక్పథంతో పోల్చి చూడొద్దు. పవన్ కల్యాణ్‌ సినిమా రంగంలో ఉన్న మంచి భవిష్యత్తు నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించారు’ అని రాజమౌళి చెప్పుకొచ్చారు.

Loading...