Friday, April 26, 2024
- Advertisement -

నా సినిమాకి ఈ హీరోనా అని ఫీల్ అయ్యా : రాజమౌళి

- Advertisement -

రాజమౌళి, ఎన్టీఆర్ ముందు నుంచి మంచి స్నేహితులు అన్న విషయం తెల్సిందే. ఇప్పటికే వీరి కాంబినేషన్ ‘స్టూడెంట్ నెంబర్ 1’ ‘సింహాద్రి’ ‘యమదొంగ’ వచ్చి సూపర్ హిట్ అయ్యాయి. వీరి కాంబోలో వచ్చిన మొదటి చిత్రం స్టూడెంట్ నెంబర్1. అంతేకాదు ఎన్టీఆర్ వరుస ప్లాప్ లతో ఉన్నప్పుడు… అతని లుక్ తో విమర్శలు పాలైనప్పుడు… మొత్తం ఎన్టీఆర్ లుక్ ను మార్చేసి..’యమదొంగ’ తో హిట్ ఇచ్చి.. ఆదుకున్నది కూడా రాజమౌళినే.

ఒక విధంగా చెప్పాలి అంటే ఎన్టీఆర్ ను మళ్ళీ రీ లాంచ్ చేసాడనే చెప్పాలి. ఇక రాజమౌళి తనకు బాగా ఇష్టమైన హీరో ఎన్టీఆర్ అని గతంలో చాలా సార్లు చెప్పాడు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశాడు రాజమౌళి. …”తారక్‌తో మొదటి సినిమా ‘స్టూడెంట్ నెంబర్1’ చేసేటప్పుడు.. అతనికి 19 సంవత్సరాలు. సరిగ్గా మీసాలు కూడా రాలేదు. అంతేకాకుండా.. చాలా లావుగా ఉండేవాడు. హెయిర్ స్టైలింగ్, పర్సనల్ మెయిన్‌టైనెన్స్ కూడా లేదు. నాకేంటి మొదటి సినిమాకి ఇలాంటి హీరో దొరికాడని” చాలా ఫీల్ అయ్యాను.

సరే మొదటి సినిమా కదా అని.. నేను వర్క్ స్టార్ట్ చేశాను. సడన్‌గా మధ్యలో ఇంటెర్వెల్ సీన్స్‌లో ఎన్టీఆర్ డైలాగ్స్ చెబుతున్నప్పుడు అనుకున్నా.. ఇతను కచ్చితంగా పెద్ద సూపర్ స్టార్ అవుతాడని. అతని లోపల ఏదో సమ్‌థింగ్ స్పెషల్ ఉందని. తన లుక్స్‌ని దాటి జనాల్ని డైలాగ్స్‌తో విపరీతంగా అట్రాక్ట్ చేసే టాలెంట్ ఇతనిలో ఉంది. నేను ఇప్పటివరకూ ఒక కన్నుతో చూసి తప్పు చేశాను అని నాకు అనిపించింది. ఈ విషయాన్ని నేను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాను అని రాజమౌళి చెప్పుకొచ్చాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -