Saturday, April 20, 2024
- Advertisement -

విలన్ గా రాజశేఖర్.. కండీషన్స్ అప్లై

- Advertisement -

సీనియర్ హీరో రాజశేఖర్ ఇటీవలే కల్కి సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఆయన సినిమా ప్రమోషన్స్ లో బిజీ గా ఉంటూ మీడియా తో అనేక విషయాల గురించి మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు రాజశేఖర్ సెకండ్ ఇన్నింగ్స్ లో హిట్ కొడతాడా లేదా అని కామెంట్ చేసిన వాళ్లందరికీ సరైన సమాధానమే ఇచ్చాడు. కాకపోతే ఇక కెరీర్ గ్రాఫ్ గురించి మాట్లాడుతూ మరి కొన్ని సంవత్సరాలు ఇలా లీడ్ రోల్స్ చేస్తానని, నెగటివ్ పాత్రల జోలికి పోనే పోనని ఆయన తెలిపారు.

నిజానికి ధ్రువ సినిమా లో అరవింద్ స్వామి పాత్ర కోసం ముందు గా రాజశేఖర్ ని సంప్రదించారు. ఆ తరువాత బాలకృష్ణ తో ఒక సినిమా కోసం కూడా విలన్ గా రాజశేఖర్ ని అప్రోచ్ అయ్యారు. కాకపోతే అవి రెండు కుదరలేదు. రాజశేఖర్ కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ పెద్ద సినిమాల్లో అలాంటి పాత్రలు వస్తే ఆలోచిస్తాను అని, రెగ్యులర్ విలన్ పాత్రలు అయితే చేసే ఆలోచన అస్సలు లేదని తేల్చి చెప్పేసాడు.

అలాగే అరవింద సమేత లో కూడా జగపతి బాబు పోషించిన పాత్ర తనకి నచ్చిందని. అటువంటివి చేయడానికి కూడా సిద్ధమేనని ప్రకటించాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -