Friday, March 29, 2024
- Advertisement -

‘కల్కి’ మూవీ రివ్యూ

- Advertisement -

గరుడ వేగ సినిమా తో రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన రాజశేఖర్, కొంత గ్యాప్ తీసుకొని ఇప్పుడు కల్కి అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. 1983 లో జరిగిన కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా ని ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించడం జరిగింది. ఇంతకు ముందు ఆయన అ! సినిమా ని చేశారు. మొదటి సారిగా జీవిత-రాజశేఖర్ దంపతుల పిల్లల పేర్లతో, సి కళ్యాణ్ ఈ సినిమా ని నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా యొక్క ప్రచార చిత్రాలు అందరిలో ఎంతో ఆసక్తి ని రేకెత్తించాయి. ఆదా శర్మ, నందిత శ్వేతా, సిద్దు జొన్నలగడ్డ, రాహుల్ రామకృష్ణ, తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు. ఇక సినిమా సమీక్ష విషయానికి వస్తే….

కథ:
కొల్లాపూర్ అనే ఊరిలో శేఖర్ బాబు (సిద్ధు జొన్నలగడ్డ) ని చంపేస్తారు. ఆ తర్వాత ఊరిలో పరిణామాలు అన్నీ మారిపోతాయు. ఈ మర్డర్ ఎవరు చేసారో తెలుసుకొని రమ్మని కల్కి (రాజశేఖర్) అనే పొలీస్ ఆఫీసర్ ని అపాయింట్ చేస్తారు. అసలు హత్య చేసింది ఎవరు? కల్కి కేసు సాల్వ్ చేశాడా? చివరికి ఏమైంది? వీటికి సమాధానాలే ఈ కథ.

నటీనటులు:
రాజశేఖర్ ఈ సినిమాలో అద్భుతమైన నటనను కనబరిచారు. సినిమా మొత్తంలో రాజశేఖర్ నటన హైలైట్ అని చెప్పుకోవచ్చు. కష్టమైన పాత్ర అయినప్పటికీ చాలా ఈజీగా పాత్రలో ఒదిగిపోయి చాలా బాగా నటించారు రాజశేఖర్. ఆదా శర్మ ఈ సినిమాలో చాలా అందంగా కనిపించడం మాత్రమే కాక తన నటనతో కూడా మెప్పించింది. తన పాత్రకు నూరుశాతం న్యాయం చేసింది నందిత శ్వేత. ఈ సినిమాలో తనకు ఆమెకు ఒక మంచి పాత్ర దొరికింది. నాజర్ నటన కూడా ఈ సినిమాకి మరింత బలాన్ని చేకూరుస్తుంది. అశుతోష్ రానా పెర్ఫార్మన్స్ ఈ సినిమాకి ప్లస్ అయ్యింది అని చెప్పుకోవచ్చు. చరణ్దీప్ చాలా సహజంగా నటించారు. రాహుల్ రామకృష్ణ సినిమాలో కామెడీ కూడా బాగానే పండించాడు. శత్రు ఈ సినిమాలో చాలా చక్కగా నటించారు. మిగతా నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.

సాంకేతిక వర్గం:
దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ సినిమా కోసం ఒక అద్భుతమైన కథను రాసుకున్నారు. అదే సినిమాకి ఒక పెద్ద ప్లస్ పాయింట్ గా మారింది. నిజానికి కొంచెం కష్టమైన స్క్రిప్ట్ అయినప్పటికీ ప్రశాంత్ వర్మ తన దర్శకత్వం తో అందరిని మెప్పిస్తాడు. సినిమా మొదలైన దగ్గర నుంచి అయిపోయే వరకు సినిమాను అంతా ఆసక్తిగా నడిపారు. ‘అ!’ సినిమాతోనే తన ప్రతిభను నిరూపించుకున్న ప్రశాంత్ వర్మ ఈ సినిమాతో కూడా విభిన్న కథతో మరియు అలరించే స్క్రీన్ ప్లే తో సినిమాని చాలా బాగా తెరకెక్కించారు. హ్యాపీ మూవీస్ పతాకంపై సి.కళ్యాణ్ అందించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. బడ్జెట్ విషయంలో నిర్మాతలు ఏమాత్రం రాజీ పడలేదని తెలుస్తోంది. శ్రవణ్ భరద్వాజ్ అందించిన సంగీతం ఈ సినిమాకు ప్లస్ అయింది అని చెప్పుకోవచ్చు. నేపథ్య సంగీతం ప్రతి సన్నివేశాన్ని చాలా బాగా ఎలివేట్ చేసింది. దాశరథి శివేంద్ర అందించిన విజువల్స్ చాలా బాగున్నాయి. అతని కెమెరా యాంగిల్స్ కూడా కొత్తగా ఉన్నాయి. గౌతమ్ నెరుసు ఎడిటింగ్ పర్వాలేదు అనిపిస్తుంది.

తీర్పు:
సినిమా మొదలైన దగ్గర నుంచి పూర్తయ్యే వరకు చాలా ఆసక్తికరంగా నడుస్తుంది. ఒక బలమైన కథ ఉండటం ఈ సినిమాకి చాలా పెద్ద ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కష్టమైన కథ అయినప్పటికీ దాన్ని చాలా సులువుగా దర్శకుడు అందరికీ అర్థమయ్యే విధంగా నెరేట్ చేశారు. ప్రతి ఫ్రేమ్ చాలా ఆసక్తికరంగా తెరకెక్కించారు. ప్రేక్షకులకు ఏమాత్రం బోర్ కొట్టించకుండా సినిమా మొత్తం అదే సస్పెన్స్ ను మెయింటేన్ చేస్తూ వచ్చారు. మొదటి తో పోల్చుకుంటే రెండవ హాఫ్ మరింత ఆసక్తికరంగా ఉంటుంది. ఈ సినిమాలోని ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా చాలా బాగుంది. ఈ చిత్రం ప్రీ క్లైమాక్స్ మరియు క్లైమాక్స్ కూడా బాగానే హ్యాండిల్ చేశారు. ఈ సినిమాకి బలమైన కథ, నటీనటులు మరియు నేపధ్య సంగీతం ప్లస్ పాయింట్లు గా చెప్పుకోవచ్చు. చివరిగా ‘కల్కి’ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులు కచ్చితంగా చూడాల్సిన సినిమా.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -