Thursday, April 25, 2024
- Advertisement -

రాజశేఖరుడిదే రాజ్యం.. ఇక కుమ్మేసుకోవచ్చు…

- Advertisement -

గరుడవేగ సినిమాను 25 కోట్లతో తీసారని తెలియగానే అంతా ముక్కున వేలేసుకున్నారు. సినిమా కొనేవారు ఎవరుంటారని అంతా ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపించారు. కట్ చేస్తే… రాజశేకరుడి ట్రైలర్ ను డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు ఏ ముహూర్తాన వదిలాడో గాని.. దుమ్ము దులిపేశాడు. సినిమాపై పలు సందర్భాలలో ఎంతో నమ్మకాన్ని చూపించాడు.

సినిమా రిలీజ్ అయ్యాక ప్రవీణ్ సత్తారు నమ్మకం వమ్ము కాలేదు. యస్ రాజశేఖర్ చేసిన అటెంప్ట్ నిజంగా మెచ్చుకోదగినదే అని తెలిసిపోయింది. కలెక్షన్లు కూడా ఓ రేంజ్లో వస్తూ ఉండడటంతో రాజశేఖర్ ను లైట్ తీసుకున్నవారంతా మనోడిలో ఇంకా ఫైర్ ఉందని అర్ధం చేసుకున్నారు.

ఈ సినిమాతో పాటు వచ్చిన చిత్రాలేవి సరుకులేనివి కావడంతో గరుడవేగ కు ఇప్పట్లో వచ్చిన నష్టమేమి లేదు. ఆల్ రెడీ ఇంతకుముందు వారంలో రిలీజైన చిత్రాలు కొన్ని సక్సెస్ అయినా..గరుడవేగ దెబ్బకు అవి కోలుకోలేకపోతున్నాయి.ఆ లిస్ట్ లో రాజా ది గ్రేట్ ,ఉన్నది ఒక్కటే జిందగి కావడం విశేషం. సో ఈవారం కూడా వచ్చే చిత్రాలన్నీ తమిళ వాసనలతో వచ్చేవే కాబట్టి..ఆ తర్వాతి వారం వరకు రాజశేఖరుడిని అడ్డుకునే తోపు తురుము ఇక్కడ ఎవరూ లేరు.కాబట్టి మనోడు ఎంత కుమ్ముకుంటాడో అంత కుమ్ము కోవచ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -