మరో సారి గరుడ వేగ అంటున్న రాజశేఖర్

242
Rajasekhar Ready for Garuda Vega Sequel
Rajasekhar Ready for Garuda Vega Sequel

గరుడవేగ అనే సినిమా తో తెలుగు పరిశ్రమ లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన నటుడు రాజశేఖర్. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం లో వచ్చిన ఈ చిత్రం ఎంత పెద్ద విజయం సాధించింది అనే విషయం మన అందరికీ తెలుసు. అయితే ఈ సినిమా తర్వాత కొంత గ్యాప్ తీసుకున్నా కానీ రాజశేఖర్ ప్రస్తుతం కల్కి అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇది పక్కన పెడితే కల్కి తర్వాత ఈయన ఏం సినిమా చేస్తాడు అనే సందేహాలు ఎక్కువ అయ్యాయి. రాజశేఖర్ సెకండ్ ఇన్నింగ్స్ విజయం తో మొదలు పెట్టాడు గనుక, ఆ విజయాన్ని కొనసాగించాలనే తపన తో నే ముందుకు కదులుతున్నారు.

అయితే ఆయన తన తదుపరి చిత్రం గురించి ట్రైలర్ ఈవెంట్ లో ఒక హింట్ ఇచ్చారు. గరుడ వేగ సినిమా కి రెండో భాగం కథ సిద్ధం అయిందని. ఆ సినిమా నే రాజశేఖర్ చేయనున్నాడు అని తెలుస్తుంది. అయితే ఈ సినిమా ని కూడా ప్రవీణ్ సత్తారు చేస్తారా లేదా అనే విషయం మీద మాత్రం క్లారిటీ లేదు. ఇక పోతే, ఈ శుక్రవారం నాడు కల్కి సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Loading...