వామ్మో.. కల్కి కి సీక్వెల్ ఆ?

192
Rajasekhar Ready for Kalki Squeal
Rajasekhar Ready for Kalki Squeal

రాజశేఖర్ హీరో గా త్వరలో రానున్న చిత్రం కల్కి. గరుడ వేగ సినిమా తో రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన రాజశేఖర్ ఇప్పుడు, ఈ శుక్రవారం నాడు కల్కి అనే సినిమా తో మన ముందుకు రానున్నారు. అయితే ఆసక్తికర అంశం ఏంటి అంటే ఈ సినిమా కి కూడా రెండో భాగం చేయాలి అని అనుకుంటున్నారట.

ఎన్నో అంచనాల నడుమ కల్కి సినిమా శుక్రవారం నాడు విడుదల కానుంది. అయితే నిన్న కల్కి కి సంబందించిన ట్రైలర్ ఈవెంట్ కి సంబంధించి రాజశేఖర్ మాట్లాడుతూ తన తదుపరి చిత్రం గరుడ వేగ కి రెండో భాగం గా రానుంది అని చెప్పాడు. అయితే ఇప్పుడు తాజాగా దర్శకుడు ప్రశాంత్ వర్మ తన తదుపరి చిత్రం కల్కి కి రెండో భాగం చేయాలి అని చూస్తున్నట్లు తెలుస్తుంది. ఈ కథ కి రెండో భాగం చేసే స్కోప్ ఉంది అని, ఆ దిశగా ప్రశాంత్ పని చేస్తున్నట్లు తెలుస్తుంది.

అయితే ఈ రెండో భాగం లో కూడా రాజశేఖర్ హీరో గా నటిస్తాడా లేదా అనే విషయం పైన మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.

Loading...