Wednesday, April 24, 2024
- Advertisement -

2.0 తొలి రోజు కలెక్ష‌న్లు చూస్తే మ‌తి పోతుంది..!

- Advertisement -

సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ అభిమానులు ఎప్ప‌టి నుంచో ఎదురు చూస్తున్న రోబో 2.0 నిన్న‌నే(గురువారం) విడుద‌ల అయింది.సినిమాకు మొద‌టి ఆట నుంచే సూప‌ర్ హిట్ టాక్ రావ‌డంతో త‌లైవా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.విడుదలైన ప్రతి ప్రాంతం నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ర‌జినీకి అభిమానులు ఉండ‌టంతో ఈ సినిమాను 10,500 థియేటర్స్ లో విడుదలై కొత్త రికార్డును సృష్టించారు. ర‌జినీకాంత్ స్టామినా ఏంటో మ‌రోసారి నిరుపించింది ఈ సినిమా.ఒక్క హిందీ వెర్ష‌న్ల‌లోనే సినిమా 25 కోట్లకు పైగా క‌లెక్ట్ చేసింద‌ని స‌మాచారం.

ఇక ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ సినిమా తొలిరోజున 180 కోట్లు క‌లెక్ట్ చేసి ఇండియ‌న్ సినిమాల‌లోనే తొలిరోజు అత్య‌ధిక క‌లెక్ష‌న్లు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది.రోబోల‌తో కూడా ఇలాంటి మూవీ చేయ‌వ‌చ్చా అనే విధాంగా ర‌జినీ యాక్టింగ్ ఉండ‌టంతో జ‌నాలు ధియోట‌ర్ల‌కు క్యూ కట్ట‌డం ఖాయం అంటున్నారు.సినిమాకు క‌లెక్ష‌న్లు మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంది.దీంతో 2.0 సినిమా కొత్త రికార్డుల‌ను సృష్టించే అవ‌కాశం లేక‌పోలేద‌ని సినీ విశ్లేషుకులు భావిస్తున్నారు.ద‌ర్శ‌కుడు శంక‌ర్ సినిమాలో ఓ గ్లోబ‌ల్ మేసేజ్ ఇవ్వ‌డం,పైగా ఈ స్టోరీ అన్ని భాష‌ల ప్ర‌జ‌ల‌కు క‌నెక్ట్ కావడం సినిమాకు ఫ్ల‌స్ పాయింట్ . రాబోవు రోజుల‌లో చిట్టి రోబో ఎన్ని అద్భుతాలు సృష్టిస్తాడో చూద్దాం.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -