Friday, April 26, 2024
- Advertisement -

అస్లీల కామెంట్ చేసిన నెటిజ‌న్‌కు ఘాటుగా కౌంట‌ర్ ఇచ్చిన ర‌కుల్‌..

- Advertisement -

సోషియ‌ల్ మీడియాలో త‌న‌పై అస‌భ్య‌కామెంట్ చేసిన నెటిజ‌న్‌కు ఘాటుగా కౌంట‌ర్ ఇచ్చింది. కొంచెం సంస్కారం నేర్చుకోమని క్లాస్ పీకింది. దీనికి కార‌ణం ఇటీవ‌ల కార్ నుంచి దిగుతున్న త‌న ఫోటోను ర‌కుల్ ప్రీత్ సింగ్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఆ ఫోటోపై ఓ నెటిజ‌న్ అశ్లీల కామెంట్ పెట్టాడు. కార్‌లో ఏదో సెష‌న్‌లో పాల్గొన్న ర‌కుల్ ప్యాంట్ వేసుకోవ‌డం మ‌ర్చిపోయింది అని ఆ వ్య‌క్తి ర‌కుల్‌ను అవ‌మానించాడు.

మ‌రొక‌రు నీపై వచ్చిన కామెంట్స్‌ కు కౌంటర్‌ ఇచ్చేందుకు నువ్వు కూడా ఓ మహిళనే అవమానిస్తావా?” అని ఒకరు, “అసలు నువ్వు ఎలాంటి డ్రస్ వేసుకున్నావో తెలుసా?” అని ఇంకొకరు, “నీ వాలకం చూస్తుంటే ఎలాగైనా అనుకోవచ్చు” అని మరొకరు… ఇలా సాగుతోంది రకుల్ ప్రీత్ పై నెటిజన్ల ట్రోలింగ్ చేస్తున్నారు.

ఈ కామెంట్ ర‌కుల్ దృష్టికి వెల్ల‌డంతో ….ఘాటుగా స్పందించింది. నాకు తెలిసి మీ అమ్మ కూడా కార్లో చాలా సెష‌న్స్‌లో పాల్గొని ఉంటుంది. అందుకే నీకు ఈ విష‌యాలు బాగా తెలిశాయి. ఈ సెష‌న్‌ల గురించి కాకుండా కొంచెం సంస్కారానికి సంబంధించిన విష‌యాలు కూడా నేర్ప‌మ‌ని మీ అమ్మని అడుగు. ఇలాంటి మ‌నుషులు ఉన్నంత వ‌ర‌కు మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ ఉండ‌దు. ర‌క్ష‌ణ‌, స‌మాన‌త్వం అంటూ చర్చ‌లు సాగించ‌డం వ‌ల్ల ఉప‌యోగం ఉండ‌ద‌`ని ర‌కుల్ ట్వీట్ చేసింది.

అయితే ర‌కుల్ ట్వీట్‌పైకూడా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. రకుల్ కామెంట్ ను అతి కొద్దిమంది మాత్రమే సమర్ధిస్తుండగా, పలువురు విమర్శిస్తున్నారు. ఇక తనపై వస్తున్న ట్రోలింగ్ ను చూస్తున్న రకుల్, తన ట్విట్టర్ వేదికగా మరోసారి స్పందించింది. “నా నీతి, నిజాయితీలను ప్రశ్నిస్తున్నవారు మహిళలను లక్ష్యం చేసుకున్నప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు? ఇటువంటి కుంచిత మనస్కులకు బుద్ధి చెప్పేందుకు నాకు వచ్చిన పదాలను నేను వాడాను. వారికి కూడా ఓ కుటుంబం ఉందని గుర్తు చేయాలన్నదే నా అభిప్రాయం. నాపై వచ్చిన కామెంట్లే వారిపైనా వస్తే..? అతని తల్లి లాగి ఒకటిస్తుందనే అనుకుంటున్నా” అని వ్యాఖ్యానించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -