Wednesday, April 24, 2024
- Advertisement -

రకుల్ కోసం త్యాగం చేసిన నాగార్జున

- Advertisement -

రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు లో స్టార్ హీరోయిన్ స్టేటస్ ని అనుభవిస్తుంది. తెలుగు లో చేసిన మొదటి సినిమా పెద్ద ప్లాప్ అయినప్పటికీ ఆ తర్వాత వేంకటాద్రి ఎక్సప్రెస్ అనే సినిమా చేసి తెలుగు పరిశ్రమ లో తిరుగు లేదు అనే స్థాయి కి వెళ్ళింది. ఇప్పుడు రకుల్ అందరూ స్టార్ హీరోల సరసన నటించింది, అత్యధిక పారితోషికం కూడా తీసుకుంటుంది. ఇదే సరైన సమయం అని అనుకోని తన తమ్ముడిని హీరో గా ఇండస్ట్రీ లో కి లాంచ్ చేస్తుంది.

శారీరకంగా దృఢం గా ఉంటాడు కానీ, రకుల్ తమ్ముడు ఏ మేరకు పెర్ఫర్మ్ చేస్తాడు అనే విషయం మీద ఎవరికీ క్లారిటీ లేదు. పైగా భాష కూడా తెలియదు. అయినా రకుల్ ఎంతో కష్టపడి ఒక ప్రాజెక్ట్ సెట్ చేసింది. అయితే ఇప్పుడు రకుల్ తమ్ముడు చేస్తున్న సినిమా కి టైటిల్ ని ఖరారు చేసారు. ఆసక్తికరంగా నాగార్జున కెరీర్ లో సూపర్ హిట్ అయినా నిన్నే పెళ్లాడతా అనే టైటిల్ ని ఈ కొత్త సినిమా కి పెట్టారు. టైటిల్ లోగో ని కూడా నాగార్జున తో నే లాంచ్ చేయించారు.

నిజానికి నిన్నే పెళ్లాడతా తెలుగు సినిమా చరిత్ర లో ఒక క్లాసిక్ సినిమా, ఆ టైటిల్ ని అనవసరం గా పాడు చేస్తున్నారు అని అందరూ అంటున్నా కానీ తన మన్మధుడు 2 సినిమా హీరోయిన్ రకుల్ కోసం నాగార్జున ఈ త్యాగం చేయక తప్పలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -