Tuesday, March 19, 2024
- Advertisement -

చివ‌రికి ర‌కుల్ హిట్‌ కొట్టేసిందిగా…..

- Advertisement -

టాలీవుడ్ లో తన అందచందాలతో కుర్ర హీరోల మనసు దోచి వరుస సినిమాలతో నెంబర్ వన్ రేస్ లోకి వెళ్లింది బాలీవుడ్ బ్యూటీ రకూల్ ప్రీత్ సింగ్. రకూల్ నటించిన సినిమాలు హిట్టు, ఫ్లాపు అనే తేడా లేకుండా స్టార్ హీరోలందరూ ఈ బాలీవుడ్ బ్యూటీకి ఫిదా అయ్యేవారు. ఆ మద్య తెలుగు లో కాస్త సినిమాలు తగ్గడంతో కోలీవుడ్ పై కన్నేసింది. ప్రస్తుతం అక్కడ కూడా పెద్దగా సినిమాలు లేకపోవడంతో బాలీవుడ్ లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. తెలుగు, తమిళంలో ప్రయత్నాలు చేసిన రకుల్… చివ‌రికి బాలీవుడ్ లో హిట్ కొట్టింది.

అజయ్ దేవగణ్ తో చేసిన దేదే ప్యార్ దే సినిమా శుక్రవారం రోజున రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.అకీవ్‌ అలి దర్శకత్వం వహించిన ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకోవ‌డంతో ర‌కుల్ కు కొంత రిలీఫ్ ద‌క్కింది.రకుల్ తన అందాలతో ఆకట్టుకోడంతో పాటు నటన పరంగా కూడా పరిణితి చెందింది. 50 సంవత్సరాల వయసున్న వ్యక్తికీ గర్ల్ ఫ్రెండ్ గా చేసి మెప్పించింది. బాలీవుడ్ లో రకుల్ హిట్ కొట్టడంతో… ఆమెకు అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయనడంలో సందేహం లేదు.

ప్ర‌స్తుతం టాలీవుడ్ లో నాగార్జునతో మన్మధుడు 2 చేస్తున్నది. ఈ సినిమా మరో రెండు నెలల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. మే 31 వ తేదీన సూర్యతో చేసిన ఎన్జీకే కూడా రిలీజ్ అవుతున్నది. ఈ రెండు కూడా విజయాలు సాధిస్తే ర‌కుల్ జోరు మామూలుగా ఉండ‌ది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -