Thursday, April 25, 2024
- Advertisement -

రకుల్ ప్రీత్ కాబోయె మొగుడు తెలుగోడేనా

- Advertisement -

టాలీవుడ్లో మాంచి స్వింగ్ మీదున్న రకుల్ ప్రీత్ సింగ్.. రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన మ్యారీజ్ గురించి ఆసక్తికరకామెంట్లు చేసింది. ఎప్పుడు ఏం జరుగుతుంది. ఎలా జరుగుతుంది అనే విషయం మనకు తెలియదు. సో.. నా పెళ్లి కూడా జరగవచ్చు.. అది కూడా ఒక తెలుగబ్బాయితో వివాహం జరగవచ్చు అంటూ బాంబ్ పేల్చింది. అంతే ఈవిడగారు కూడా సమంతా మాదిరిగా టాలీవుడ్ హీరోని ఎవరినైనా మ్యారీజ్ చేసుకుంటుందా అని లెక్కలు వేస్తున్నారు.

టాలీవుడ్ లో ఎందరో కుర్ర హీరోలు ఉన్నారు. రకుల్ లాంటి అందగత్తె అండ్ స్టార్ హీరోయిన్ ని జీవిత భాగస్వామిగా చేసుకోవడానికి ఛాన్స్ దొరికితే ఏ హీరోను వదిలిపెట్టరు. అయితే రకుల్ కి ఇన్నేళ్లలో ఏ హీరో నుంచి ప్రపోజల్స్ రాలేదట. మొదట్లో ఓ హీరో ఆమె కెరీర్ కు హెల్ప్ చేశాడని వారిద్దరు లవర్స్ అని రూమర్స్ బాగానే వచ్చాయి.అది ఆల్మోస్ట్ నిజమన్నారు. బట్ రకుల్ వాటిని అస్సలు పట్టించుకోనేలేదు. మరి పెళ్లి చేసుకుంటే అమ్మడు ఎలాంటి వాడిని సెలెక్ట్ చేసుకుంటుందో చూడాల్సిందే. ఇంతకీ ఆ లక్కీగయ్ హైదరాబాద్ కు చెందిన పారిశ్రామిక…పొలిటిక్ ఫ్యామిళీకి చెందిన వాడిగా ఫిలింనగర్లో రూమర్లు చక్కెర్లు కొడుతున్నాయి. మరి అతగాడు త్వరలో ఏదో ఒక రకంగా పార్టీ ఈవెంట్స్ లో ఫొటోగ్రాఫర్లకు దొరక్కపోడు. వెయిట్ అండ్ సీ.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -