Friday, March 29, 2024
- Advertisement -

రకుల్ ని నాగార్జున అద్దెకి తెచుకుంటాడట!

- Advertisement -

మన్మధుడు 2 టీజర్ విడుదల అయిన దగ్గర నుండి ఈ సినిమా కి సంబంధించి చాలా అప్డేట్స్ వస్తున్నాయి. టీజర్ చూసిన వాళ్లందరిలో చాలా తక్కువ మందికే ఈ టీజర్ నచ్చింది. మన్మధుడు ని స్పాయిల్ చేస్తున్నారు అని చాలా మంది కామెంట్ చేసిన విషయం కూడా వాస్తవమే. నాగార్జున ని ప్రస్తుతం ప్లే బాయ్ తరహా పాత్ర లో అభిమానులు కూడా చూడాలని అనుకోవడం లేదు కానీ దర్శకుడు రాహుల్ మాత్రం మళ్ళి సహజత్వానికి దూరం గా నాగార్జున ని చూపించనున్నాడా అనే టాక్ నడుస్తుంది. అంతే కాకుండా ఈ సినిమా ని ఒక ఫ్రెంచ్ సినిమా తో పోలుస్తూ చిత్ర యూనిట్ సినిమా కథ ని కాపీ కొట్టారేమో అనే డవుట్స్ ని కూడా వ్యక్తపరుస్తున్నారు.

ఈ నేపథ్యం లో టీజర్ లో రకుల్ ప్రీత్ కి స్థానం కల్పించకపోవడం తో రాహుల్ మీద రకుల్ అభిమానులు కోపం గా ఉన్నారు. అయితే వాళ్ళని ఓదార్చేందుకు రాహుల్ రకుల్ మీద స్పెషల్ టీజర్ ని కట్ చేస్తాము అని తెలిపాడు. అయితే ఈ సినిమా లో రకుల్ పాత్ర మీద కూడా చాలా డవుట్స్ ఉన్నాయి. ఈ సినిమా లో రకుల్ నాగార్జున కి అద్దె పెళ్ళాం గా నటిస్తుంది అని టాక్. ఇందులో అక్షర గౌడా, కీర్తి సురేష్, సమంత కూడా నటించనున్నారు. వారి పాత్రలు ఏంటి అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -