Friday, April 19, 2024
- Advertisement -

మ‌హ‌నాయ‌కుడును మ‌ళ్లీ వాయిదా వేశారుగా..!

- Advertisement -

తెలుగు వెండితెర దైవంగా భావించే ఎన్టీఆర్ జీవిత క‌థ‌పై ఇప్ప‌టికే చాలా క‌థ‌లు తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఎన్టీఆర్ త‌న‌యుడు బాల‌కృష్ణ ఎన్టీఆర్ బ‌యోపిక్‌ను రెండు పార్ట్‌లుగా తెర‌కెక్కించారు. క‌థానాయ‌కుడు, మ‌హ‌నాయ‌కుడు ఇలా రెండు పార్ట్‌ల‌తో ఎన్టీఆర్ జీవితాన్ని సినిమాగా తీశారు. మొద‌టి పార్ట్ క‌థానాయ‌కుడు సంక్రాంతి కానుక‌గా విడుద‌లై ఘోర ప‌రాజ‌యం పాలైంది. సినిమాలో ఏం బాలేద‌ని ప్రేక్ష‌కులు తెల్చేశారు. దీంతో రెండో పార్ట్ మ‌హ‌నాయ‌కుడుపై ఒత్తిడి పెరిగింది. రెండో పార్ట్‌ను విడుద‌ల చేయ‌డంలో ఆల‌స్యం కావ‌డంతో సినిమాపై అందరికి అనుమానాలు పెరిగాయి. దీంతో సినిమా విడుద‌ల తేదీని హడావిడిగా అనౌన్స్ చేశారు. మ‌హ‌నాయ‌కుడును ఈ నెల 22న ప్రేక్ష‌కుల ముంద‌కు తీసుకురానున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైల‌ర్‌ను హడావిడిగానే విడుద‌ల చేస్తున్నారు చిత్ర యూనిట్‌.

ఇవాళ సాయంత్రం 5 గంటల 55 నిమిషాలకు ఎన్టీఆర్ మహానాయకుడు ట్రైలర్ రిలీజ్ టైమ్‌ని ఫిక్స్ చేస్తూ కొత్తగా పబ్లిసిటీ స్టార్ట్ చేసారు. అయితే ఈ పోస్ట‌ర్ సినిమా విడుద‌ల అతి త్వ‌ర‌లో అని ఉండ‌టంతో సినిమా మ‌రోసారి వాయిదా ప‌డింద‌ని తెలుస్తోంది. ఇలా సినిమాను వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటు పోతే సినిమాపై అంద‌రికి ఆస‌క్తి త‌గ్గిపోతుంద‌ని అంటున్నారు నంద‌మూరి అభిమానులు. ఇప్ప‌టికే వైఎస్ఆర్ బ‌యోపిక్ యాత్ర సినిమా విడుద‌లై సూప‌ర్ హిట్ కావ‌డంతో మ‌హ‌నాయ‌కుడుపై మ‌రింత ఒత్తిడి పెరిగింది. మ‌రి సినిమా రిలీజ్ డేట్‌ను ఎప్పుడు చెబుతారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -