Wednesday, April 24, 2024
- Advertisement -

ఇంటి పనులు చేసిన రామ్ చరణ్.. (వీడియో)

- Advertisement -

అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా విసిరిన ‘బీ ద రియల్ మ్యాన్’ సవాలును స్వీకరించిన డైరెక్టర్ రాజమౌళి తన ఇంటిని పరిశుభ్ర పరిచి సినీనటులు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు చాలెంజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే జూ.ఎన్టీఆర్ ఈ సవాలును స్వీకరించి ఇల్లు, వాకిలి శుభ్రం చేసి ఇందుకు సంబంధించిన వీడియో పోస్ట్ చేశాడు.

అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇక తాజాగా రామ్ చరణ్ కూడా సవాలు స్వీకరించాడు. ఇల్లు శుభ్రం చేసి, బట్టలు పిండి, మొక్కలను నీళ్లు పోసి, భార్య ఉపాసనకు కాఫీ పెట్టి ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఇంట్లో ఈ పనులు చేయడం పట్ల గర్వంగా ఉందన్నాడు. మహిళల వర్క్‌ లోడ్‌ను షేర్ చేసుకుని నిజమైన మగాడిలా ఉండాలని సూచించాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇక త్రివిక్రమ్, రణ్‌వీర్, రానా, శర్వానంద్‌లకు ఆయన విసిరాడు. ఇక చరణ్ ప్రస్తుతం ఆర్‍ఆర్‍ఆర్ సినిమాలొ నటిస్తున్న విషయం తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. లాక్ డౌన్ తర్వాత మళ్లీ షూటింగ్ మొదలు కానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -