Saturday, April 20, 2024
- Advertisement -

అభిమాని కుటుంబంకు సాయం చేసిన రామ్ చరణ్..!

- Advertisement -

మెగా కుటుంబం తమ ఫ్యాన్స్ కి ఎప్పుడు అండగా నిలుస్తుందని మరోసారి ప్రూవ్ చేశాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. కొన్ని రోజుల క్రితం మెగా ఫ్యామిలీ వీర అభిమాని సిటీ చిరంజీవి యూత్ ప్రెసిడెంట్ అయిన నూర్ అహ్మద్ గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే.

ఆయన మరణ వార్త తెలుసుకున్న చిరంజీవి, అల్లు అర్జున్, రామ్ చరణ్ వెంటనే ఆయన ఇంటికి వెళ్లి కుటుంబాన్ని పరామర్శించి మేము అండగా ఉంటామని తెలియజేశారు. చెప్పినట్టుగానే ఇటీవలే రామ్ చరణ్ నూర్ కుటుంబ సభ్యులను తన ఇంటికి పిలిపించి కాసేపు వారితో మాట్లాడి ఆ కుటుంబానికి 10 లక్షల రూపాయల చెక్కును అందజేశారు.

ఎప్పుడు మీ కుటుంబానికి మేము అండగా ఉంటామని మరోసారి రామ్ చరణ్ వారికి హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. రామ్ చరణ్ నూర్ కుటుంబానికి చెక్ అందిస్తున్న ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్స్ కి అండగా నిలబడుతున్న మెగా కుటుంబాన్ని చూసి చాలా గర్వంగా ఉంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -