Friday, March 29, 2024
- Advertisement -

టాలీవుడ్ డైరెక్టర్ లు ఎందుకు చరణ్ కి కావాల్సిన కథ రాయలేకపోతున్నారు..?

- Advertisement -

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తండ్రికి తగ్గ తనయుడిగా వ్యవహరిస్తూ మంచి మంచి సినిమాలు చేస్తూ ప్రజల అభిమానాన్ని సంపాదించుకుంటున్నారు.. చిరుత సినిమా తో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ రెండో సినిమా మగధీర తో ఇండస్ట్రీ ని శాసించే విధంగా హిట్ కొట్టాడు. అప్పటినుంచి రామ్ చరణ్ ఇక వెను దిరిగి చూసుకోలేదు.. వరుస హిట్ల తో మెగా అభిమానులకు దగ్గరయి తండ్రిని మించి కొడుకుగా పేరు తెచ్చుకున్నాడు. ఇక తాజాగా రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ తో కలిసి RRR అనే సినిమా చేస్తున్నారు. చరణ్ కెరీర్ లో అన్ని రకాల జోనర్ సినిమా చేశాడని చెప్పాడు..

యాక్షన్ ప్రధానంగా ఎవడు, రచ్చ, నాయక్, వినయ విధేయ రామ లాంటి చిత్రాలని, కుటుంబ విలువలు చూపే గోవిందుడు అందరివాడే, బ్రూస్ లీ, రంగస్థలం, స్టైలిష్ కాప్ గా ధృవ, యుద్ధ నేపథ్యంలో మగధీర, పూర్తి లవర్ బాయ్ గా ఆరంజ్ ఇలా అన్ని జోనర్లలో చరణ్ సినిమాలు చేయగా ఒక తీరని కోరిక మాత్రం రామ్ చరణ్ కి మిగిలి ఉదేనట.. అదే తన డ్రీం ప్రాజెక్ట్ అని ఇటీవలే చెప్పాడు.

తనకి స్పోర్ట్స్ బ్యాగ్ డ్రాప్ లో ఓ సినిమా చెయ్యాలనేది కల అంటున్నాడు. అయితే గతంలో ఆర్బీ చౌదరి గారి బ్యానర్లో స్పోర్ట్స్ నేపథ్యం ఉన్న కథతో మెరుపు అనే సినిమాను స్టార్ట్ చేశాం. అయితే కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది. అదిగో అప్పటి నుంచీ స్పోర్ట్స్ నేపథ్యంలో ఆసక్తికరంగా సాగే ఒక కథ కోసం ఎదురు చూస్తున్నాను. కానీ ఇంతవరకు నాకు నచ్చిన మెచ్చిన స్పోర్ట్డ్స్ బ్యాగ్డ్రాప్ ఉన్న కథ దొరకలేదు. నన్ను టెంప్ట్ చేసే స్క్రిప్ట్ వస్తే ఖచ్చితంగా నా డ్రీం ప్రాజెక్ట్ మొదలు పెడతానంటున్నాడు రామ్ చరణ్. మరి టాలీవుడ్ డైరెక్టర్ లు ఇంకెందుకు ఆలస్యం.. ఆ కథే రాసేసి రామ్ చరణ్ తో సినిమా కొట్టేయండి..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -