Friday, March 29, 2024
- Advertisement -

సైరా ఫ్లాప్ కు కారణం అదే : రామ్ చరణ్

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం సైరా నరసింహా రెడ్డి. రిలీజ్ తర్వాత ఎవరు ఊహించని పెద్ద హిట్ అయింది ఈ సినిమా. తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్స్ సంపాదించింది. తెలుగు సినిమా కలెక్షన్స్ లో టాప్ లో నిలిచింది. కానీ హిందీలో మాత్రం తీవ్ర నిరాశ పరిచింది. అనుకున్నదాని కంటే చాలా తక్కువ కలెక్షన్స్ అక్కడ రాబట్టింది. ఓవర్సీస్ లో కూడా తక్కువ కలెక్షన్స్ వచ్చాయి. దాంతో తెలుగు రాష్ట్రాల్లో తప్పిస్తే బాలీవుడ్, ఓవర్సీస్ లో నష్టాలు వచ్చాయనే చెప్పాలి.

నిజానికి బాలీవుడ్ ప్రేక్షకుల నుంచి సైరా సినిమాకు మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ సినిమాని ఎక్కువ మంది చూడలేదు. అందుకే చరణ్ కు ఆ రకంగా నష్టం వచ్చింది. అయితే తాజాగా రామ్ చరణ్ సైరా హిందీ వర్షన్ ప్లాప్ పై తన వివరణ ఇచ్చాడు. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సైరా సంతృప్తి కలిగించిందని చెప్పుకొచ్చాడు. బాలీవుడ్ లో సైరా సినిమాకు ఎక్కువగా కలెక్షన్స్ రాకపోవడానికి ప్రధాన కారణం వార్ సినిమా అంటూ చెప్పాడు. వార్ సినిమాకు మంచి క్రేజ్ ఉంది.

సైరా టైంలోనే వార్ కూడా రావడం వల్ల సైరాకు దెబ్బ పడింది అని చెప్పాడు. వార్ సినిమా ఆ టైంకి రిలీజ్ కాకుంటే సైరాకు మంచి కలెక్షన్స్ వచ్చేవని అన్నాడు. ఏది ఏమైన సైరాను ప్రేక్షకులు మెచ్చుకున్నారు అది గొప్ప విషయం అని చరణ్ చెప్పాడు. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -