Friday, April 26, 2024
- Advertisement -

తారక్ తో చరణ్ స్నేహం ఎప్పటిదో తెలుసా ?

- Advertisement -

ఆర్.ఆర్.ఆర్ సినిమా కోసం ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులే కాదు ఇతర ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు. అయితే ఆర్.ఆర్.ఆర్ ప్రస్తుతం ఏ సీన్ షూట్ చేస్తున్నారు ? తారక్ ఆన్ లొకేషన్ చరణ్ ఎలా ఉండేవాడు ? ఆలియాతో రొమాన్స్ విషయం ఏంటి ? ఇలాంటి ప్రశ్నలకు చరణ్ జవాబు ఇచ్చారు. ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ ఇప్పటికే 70 శాతం పైగా కంప్లీట్ అయింది.

ఆ క్రమంలోనే మీడియా చిట్ చాట్ లో చరణ్ రకరకాల సంగతులు చెప్పాడు. ప్రధానంగా తన స్నేహితుడు ఎన్టీఆర్ గురించి చరణ్ కాస్త ఉద్వేగంగానే స్పందించాడు. ఎన్టీఆర్ తో స్నేహం కేవలం ఆర్.ఆర్.ఆర్ వల్లనే కుదిరిందని అంతా అనుకుంటున్నారని.. అయితే తామిద్దం చాలా కాలంగా స్నేహితులమేనని చరణ్ తెలిపారు. జక్కన్న వల్ల కలిసిన బంధం కానేకాదని అంతకుముందు నుంచి స్నేహం ఉందని.. ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ సెట్స్ లో అది మరింత స్ట్రాంగ్ అయ్యిందని తెలిపారు.

ఆన్ లకేషన్ ఒక ఫైర్ క్రాకర్ లా తారక్ పని చేస్తాడని.. తనతో కలిసి పని చేయడం ఎంతో ఆనందాన్నిచ్చిందని అన్నారు.ఆర్ ఆర్ ఆర్ సినిమా వల్ల రెగ్యులర్ గా కొన్ని గంటలపాటు కలిసి ఉండటంతో తమ మధ్య అనుబంధం మరింత ధృడపడిందని చరణ్ తెలిపాడు. ఉత్తరాంధ్రలో అల్లూరి సీతారామరాజు .. తెలంగాణ లో కొమరం భీమ్ ఒకే విధంగా స్వాతంత్య్రం కోసం పోరాడారు.

అలాంటి గొప్ప చరిత్రకారుల పాత్రలను తాము పోషించడం అదృష్టంగా భావిస్తున్నానని రామ్ చరణ్ అన్నారు. ఇక తారక్ తో నటించడం చాలా సరదాగా ఉందని.. అతను సెట్స్ లో లేకుంటే ఏమి తోచదని చరణ్ అన్నారు. ఇక అలీయా, తనకు మధ్య వచ్చే సీన్స్ ఇంకా చిత్రీకరణ జరగలేదని.. త్వరలోనే షూట్ చేస్తారని చరణ్ తెలిపారు. ఆలియా ఈ చిత్రంలో సీత పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -