Saturday, April 20, 2024
- Advertisement -

ఆర్‍ఆర్‍ఆర్ నుంచి అల్లూరి ఫస్ట్ లుక్ టీజర్ (వీడియో)..!

- Advertisement -

రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు నటిస్తున్న సినిమా ఆర్‍ఆర్‍ఆర్. ఈ సినిమా కోసం దేశం మొత్తం ఎదురుచూస్తోంది. ఇటీవలే ఈ సినిమాకు “రౌద్రం రణం రుధిరం” టైటిల్ గా నిర్ణయించారు.

అయితే ఈ రోజు చరణ్ బర్త్ డే కానుకగా ఆర్‍ఆర్‍ఆర్ నుంచి సర్ ఫ్రైజ్ గిఫ్ట్ ఉందంటూ ఉదయన్నే ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. అన్న టైం కన్నా కాస్త లేటుగా గిఫ్ట్ ఇచ్చిన.. అది అదిరిపోయేలా ఉంది. ఆర్‍ఆర్‍ఆర్ అల్లూరి సీతారామరాజును పరిచయం చేస్తూ, ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ లో 1.13 నిమిషాల నిడివి వున్న ఫస్ట్ లుక్ టీజర్, తెలుగుతో పాటు పలు భాషల్లో విడుదలైంది. మూడింటిలోనూ ఎన్టీఆర్ స్వయంగా డబ్బింగ్ చెప్పారు. “ఆడు కనబడితే నిప్పుకణం నిలబడినట్టుంటది. కలబడితే ఏగుచుక్క ఎగబడినట్టుంటది. ఎదురుబడితే చావుకైనా చెమటలు ధారకడతది. పాణమైనా, బందూకైనా వానికి బాంచనైతది. ఇంటి పేరు అల్లూరి.

సాకింది గోదారి. నా అన్న… మన్నెం దొర… అల్లూరి సీతారామరాజు” అంటూ ఎన్టీఆర్ పరిచయం సాగింది. ఇక ఇందులో రామ్ చరణ్ కసరత్తులు, ధ్యానం చేయడం తుపాకి, బాణాలను ప్రయోగించడం వంటి దృశ్యాల కట్స్ కనిపిస్తున్నాయి. విడుదలైన రెండు నిమిషాల వ్యవధిలోనే తెలుగు వర్షన్ వ్యూస్ లక్ష దాటింది. తమిళ్, హిందీ, కన్నడ, మళయాల భాషల్లోనూ ఇదే ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. ఈ టీజర్ చూసినవారికి గూస్ బంప్స్ వస్తున్నాయి. మీరు కూడా చూసేయండి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -