కియారా అద్వానీ కెరీర్‌ను నాశనం చేసిన రామ్ చ‌ర‌ణ్‌

1065
Ram charan vinaya vidheya rama flop effect on kiara advani
Ram charan vinaya vidheya rama flop effect on kiara advani

బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ తెలుగు ఇండ‌స్ట్రీలో ఓ వెలుగు వెలుగుదమ‌ని అనుకుంది. దీనికి త‌గిన‌ట్లుగానే టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మహేశ్ బాబు వంటి హీరోతో త‌న మొద‌టి సినిమా చేసింది. మ‌హేశ్‌తో న‌టించిన భ‌ర‌త్ అనే నేను సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద పెద్ద హిట్‌గా నిలిచింది. వెంట‌నే మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ , బోయ‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన విన‌య విధేయ రామా సినిమాలో హీరోయిన్‌గా ఎంపిక అయింది. దీంతో అంద‌రు కియారా తెలుగులో టాప్ హీరోయిన్‌గా మారుతుంద‌ని భావించారు.

కాని సీన్ పూర్తిగా మారిపోయింది. ఈ సంక్రాంతికి వ‌చ్చిన విన‌య విధేయ రామా సినిమా ఘోరంగా ఫ్లాప్ అయింది. ఈ సినిమా ప్ర‌భావం హీరోయిన్ కియారాపై బాగా చూపించింది. కియారాకు ఈ సినిమా త‌రువాత తెలుగులో మ‌రో సినిమా చేసే అవ‌కాశం రాలేదు. అల్లు అర్జున్ ,త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న కొత్త సినిమాలో హీరోయిన్‌గా మొద‌ట కియారా పేరు వినిపించిన‌ప్ప‌టికి త‌రువాత ఆమె స్థానంలో పూజా హెగ్డె వచ్చి చేరింది.

ఇలా కియారా అద్వాని చేతి వ‌ర‌కు వ‌చ్చిన సినిమాలు చేయి జారిపోతున్నాయి. దీంతో కియారా కెరీర్ మీద రామ్ చ‌ర‌ణ్ పెద్ద దెబ్బ కొట్ట‌డ‌ని అని అనుకుంటున్నారు ఆమె అభిమానులు. అయితే ఇదే స‌మ‌యంలో బాలీవుడ్‌లో ఆమెకు వ‌రుస ఆఫ‌ర్లు రావ‌డం విశేషం. కియారా ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో మూడు సినిమాల్లో న‌టిస్తోంది. అర్జున్ రెడ్డి రీమేక్‌లో హీరోయిన్‌గా కియారానే న‌టిస్తోంది.