Friday, April 19, 2024
- Advertisement -

అఖిల్ కు రామ్ గోపాల్ వర్మ సోపు

- Advertisement -

రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఎవరికి వంత పాడతాడో ఎవరిని ఎత్తి వెంటనే అలా పారేస్తాడో.. అస్సలు అతనికే తెలియదు. అందుకే వర్మతో రాసుకు పూసుకు తిరగడానికి అంతా వర్రీ అవుతుంటారు. పూరి అండ్ గ్యాంగ్ రాముతోనే ఉండి… చేయాల్సింది చేస్తూ ఉంటారు. తాజాగా రాము నాగార్జునతో సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈసినిమా ముహూర్తపు షాట్ కొట్టడం… ఆతరువాత హీరోయిన్ విషయంలో మనస్పర్థలు రావడం చకచకా జరిగిపోయాయి. కాని సినిమా అయితే ఆగిపోయినట్లుగా ఎక్కడా కనిపించడం లేదు. టాప్ హీరోయిన్ ను తీసుకుంటే నిర్మాతను నేనే కాబట్టి… రెమ్యునిరేషన్ పెరిగిపోతుందనేది వర్మ ఉద్దేశ్యం కావచ్చు.

తాజాగా రాము నాగ్ ను ఇంప్రెస్ చేయడానికి అన్నట్లుగా ‘హలో’ చిత్ర బృందాన్ని ప్రశంసించాడు. అఖిల్‌ నటిస్తున్న హలో చిత్ర ట్రైలర్ ను శుక్రవారం విడుదల చేసిన అనంతరం … ఈ సినిమా ట్రైలర్‌ను చూసిన రాము … తన ఫేస్‌బుక్‌ వేదికగా రియాక్ట్ అయ్యాడు. సినిమాపై తన అభిప్రాయాన్ని సూపర్బ్ గా పంచుకున్నాడు. ‘‘అఖిల్‌ తనకు తానుగా ‘అఖిల్‌’ చిత్రంతో లాంచ్‌ అవ్వాలి అనుకున్నారు. కానీ, అతడు ప్రేక్షకులకు ‘హలో’ చెప్పినప్పుడు విధి అతడి కోసం మరో ప్లాన్‌ను సిద్ధం చేసినట్లు ఉంది. అతడి ముఖంలోని ఈజ్‌, తీవ్రత చూసి ఆశ్చర్యపోయా. యాక్షన్‌ చాలా తాజాగా అనిపించింది. విక్రమ్‌ ‘మనం’లోని ఆ గుడ్‌ఫీల్‌తో ఈ సినిమాను రొమాంటిక్‌ అడ్వెంచర్‌గా తీస్తున్నారు.

డిసెంబరు 22 వరకు ఆగలేను’ అంటూ వర్మ తన ఫేస్‌బుక్‌ పోస్ట్‌ చేశాడు. అలాగే ట్రైలర్‌ లింక్‌ను తన పోస్ట్ లో షేర్ చేశాడు. ‘హలో’ సినిమాలో కల్యాణి కథానాయికగా నటిస్తుంది. రమ్యకృష్ణ, జగపతిబాబు, అజయ్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై నిర్మిస్తున్న ఈసినిమాకు నిర్మాత.నాగార్జునే. ఎప్పటిలాగానే అనూప్‌ రూబెన్స్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. డిసెంబరు 22న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -