Thursday, April 25, 2024
- Advertisement -

నిఖిల్ ఎవరో నాకు తెలియదు : వర్మ షాకింగ్ కామెంట్స్

- Advertisement -

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన సెటరికల్ మూవీ ’పవర్ స్టార్’ పై జగనసేనాని ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇండస్ట్రీలోని కొంత మంది సెలబ్రిటీలు కూడా వర్మ వైఖరిని తప్పుబడుతున్నారు. అంతేకాకుండా వర్మకు వ్యతిరేకంగా ఆయనపై ‘పరాన్నజీవి’ అనే సినిమాను పవన్ అభిమానులుగా చెప్పుకుంటున్న కొంతమంది రూపొందిస్తున్నారు.

ఈ మూవీకి కొంత మంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మద్దతు తెలుపుతున్నారు. ఈ క్రమంలో యంగ్ హీరో నిఖిల్ చేసిన ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది. శిఖరంని చూసి కుక్క ఎంత మొరిగినా.. ఆ మహా శిఖరం తల తిప్పి చూడదు. మీకు అర్థం అయ్యిందిగా..’’ అని నిఖిల్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇది వర్మను ఉద్దేశించి చేసిన ట్వీట్ అని అందరికీ అర్దం అయింది. పవన్ ను శిఖరంతో పోల్చిన నిఖిల్.. వర్మను కుక్కతో పోల్చడంతో పవన్ ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. అయితే, నిఖిల్ చేసిన వ్యాఖ్యలపై వర్మ స్పందించారు.

ఓ ఛానెల్ ఇంటర్వ్యూలో నిఖిల్ వ్యాఖ్యల గురించి యాంకర్ ప్రస్తావించారు. వెంటనే స్పందించిన వర్మ నిఖిల్ ఎవరో తనకు తెలీదన్నారు. ‘‘నిఖిల్ కావచ్చు, కిఖిల్ కావచ్చు.. వాళ్లంతా ఒకే కోవకు చెందినవాళ్లు. వీళ్లంతా పవన్ కళ్యాణ్ కింద తొత్తులు. ఇలా తొత్తుల్లా ఉంటే పవన్ కళ్యాణ్‌కు వీళ్లమీద మంచి అభిప్రాయం వస్తుందని వీళ్ల ఆశ. బానిసత్వం అనే బుద్ధిలో నుంచి వచ్చే ఆలోచన ఇది. నిఖిల్ ఎవడో నాకు తెలీదు. ఒక పెద్ద స్టార్ అయ్యుండొచ్చు.. కానీ నాకు తెలీదు’’ అని వర్మ చెప్పుకొచ్చాడు.

ఘనంగా జరిగిన నితిన్, శాలిని ఎంగేజ్మెంట్..!

మళ్లీ డాన్స్ తో కుర్రకారు మతిపోగిట్టిన ప్రగతి ఆంటీ..!

`పవర్ స్టార్` ట్రైలర్ రిలీజ్.. వర్మ టార్గెట్ మాములుగా చేయలేదు..!

ఉపాసన బర్త్ డేకి సర్ ఫ్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన చైతు సమంత ..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -