పవర్ స్టార్ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన వర్మ..!

662
ram gopla varma movie on power star
ram gopla varma movie on power star

రామ్ గోపాల్ వర్మ ఏం చేసిన ఓ పెద్ద సంచలనమే. ఎప్పుడు ఏదో వివాదంతో వార్తల్లో నిలుస్తూ ఉంటారు. అయితే ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ ను పొగడ్తలతో ముంచెత్తుతున్నాడు. పవన్ ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీ అని…భవిష్యత్ లో సీఎం అవుతారని చెబుతున్నాడు. పవన్ పై సందు దొరికినప్పుడల్లా…సెటైర్ లు వేసే వర్మ, ఈ విధంగా ప్రశంసించడం అందరికీ ఆశ్చర్యం వేసింది.

ఆయన అప్పటి మాటల వెనుక ఆంతర్యం, వ్యంగ్యం ఏంటో తెలుసుకోవాడానికి పవన్ అభిమానులు కి కొంచెం సమయం పట్టింది. పవర్ స్టార్ అనే మూవీని తెరకెక్కిస్తున్నాను అని ప్రకటించిన వర్మ, పవన్ ని పోలిన ఓ వ్యక్తి తన ఆఫీస్ కి వచ్చి వెళుతున్న వీడియో పంచుకున్నారు. ఆ వీడియో బ్యాక్ గ్రౌండ్ లో అత్తారింటికి దారేది సినిమా బీజిఎమ్ ప్లే చేశాడు. దాంతో పవన్ ని గెలికే కార్యక్రమం వర్మ పెట్టుకున్నాడని అర్థం అయ్యింది. ఇక నేడు పవర్ స్టార్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసి టైటిల్ లోగోలో జనసేన పార్టీ సింబల్ అయిన గాజు గ్లాసు పెట్టారు.

దానితో పాటు పోస్టర్ పై ఎన్నికల తరువాత కథ అని చెప్పి, వర్మ పవన్ ని ఏ యాంగిల్ లో టార్గెట్ చేయనున్నాడో చిన్న హింట్ ఇచ్చాడు. ఎన్నికల్లో ఘోర పరజం చూసిన విషయంను వర్మ మరోసారి గుర్తు చేస్తున్నాడు. ఇక ఈ మూవీలో చిరంజీవి పాత్ర కూడా ఉంటుందని, ఓ వర్కింగ్ స్టిల్ విడుదల చేసి తెలియజేశాడు. గతంలో కూడా అమ్మరాజ్యంలో కడపబిడ్డలు మూవీలో పవన్ ని ఆయన పార్టీని అబాసుపాలు చేసిన వర్మ మరో మారు పవన్ అభిమానులను హర్ట్ చేసేందుకు రెడీ అయ్యారు.

హీరోయిన్ ని ముద్దులతో ముంచెత్తిన వర్మ..!

పొట్ట తగ్గట్లేదు అంటూ అద్దంని తిడుతున్న విష్ణు ప్రియా..!

ప్రముఖ నటి, ఎంపీ సుమలతకు కరోనా పాజిటివ్..!

‘దృశ్యం’లో నటించిన ఈ పాప.. హీరోయిన్ అయింది..!

Loading...