రామ్ రెడ్ ఇంత చీప్ రేటుకి అడుగుతున్నారా..?

637
ram red movie got very cheap rate
ram red movie got very cheap rate

గత కొన్ని సినిమాలనుండి రామ్ కి పెద్ద గా హిట్స్ రావట్లేదు అయితే పూరి జగన్నాధ్ సినిమా తో రామ్ కం బ్యాక్ చేశాడు.. ఇష్మార్ట్ శంకర్ తో ఇండస్ట్రీ హిట్ కొట్టి అటు పూరి, ఇటు రామ్ లు ఇద్దరు సరైన టైం లో హిట్ కొట్టారు.. ఈ సినిమా తో ఇద్దరికీ పూర్వ వైభవం వచ్చినంత పనైంది. ఇక పూరి జగన్నాధ్ విజయ్ దేవరకొండ తో సినిమా ఓకే చేయించుకోగా రామ్ తనకు హిట్ ఇచ్చిన కిషోర్ తిరుమల తో ఓ తమిళ రీమేక్ చేశాడు.. “రెడ్” అనే పేరు తో తెరకెక్కిన ఈ సినిమా  నుంచి టీజర్, సాంగ్స్ వచ్చినా అవి పెద్దగా ఆకట్టుకోలేదు.

అసలు రెడ్ సినిమా ను చూస్తుంటే అదోలా ఉంది.. రామ్ అభిమానులు ఈ సినిమా ను ఎలా ఒప్పుకున్నాడని అడుగుతున్నారు.. వరుసగా రెండు సినిమాలు చేసిన కిషోర్ తిరుమల తో మరో స్ట్రైట్ సినిమా చేస్తే బాగుండేది ఇలా రీమేక్ ని నమ్ముకుని ఎందుకు బరిలోకి దిగాడు అని అంటున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ విషయంలో దర్శక నిర్మాతలు తలలు పట్టుకుని పరిస్థితి ఏర్పడిందట.. బయట పరిస్థితి  చూస్తుంటే ఇప్పుడప్పుడే థియేటర్లు ఓపెన్ అయ్యేలా లేవు.

పోనీ అన్ని సినిమాల్లా OTT లకి ఈ సినిమా ని అమ్మేద్దామంటే ఒకప్పుడు  చెప్పిన ఫ్యాన్సీ ప్రైజ్ కాకుండా చాలా చీప్ గా సినిమాను అడుగుతున్నారట. దీంతో అప్పుడే అమ్మేస్తే తాము గట్టెక్కేవాళ్ళమని నిర్మాతలు వాపోతున్నారు.. ఇక హీరో రామ్ ఇటీవలే ఓ పొలిటికల్ ఇష్యూ లో ఇరుక్కున్న విషయం అందరికి తెలిసిందే.. దాంతో కొంత రామ్ ఇమేజ్ డ్యామేజ్ అయితే అయ్యిందని చెప్పుకోవాలి.. తన సినిమాలు తాను చేసుకోక ఈ పొలిటికల్ వ్యవహారాలు మనకెందుకు అని అభిమానులు సలహా ఇస్తున్నారు.. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.. రామ్ పై పలువురు రాజకీయ నాయకులూ విరుచుకుపడ్డారు.. ఆ ఎఫెక్ట్ రామ్ సినిమా రెడ్ పై పడిందని చెప్పొచ్చు..

Loading...