Thursday, April 25, 2024
- Advertisement -

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ప్ర‌మోష‌న్ కోసం ట్రంప్‌ను కూడా వ‌ద‌ల్లేదుగా వ‌ర్మ‌..

- Advertisement -

రామ్‌గాపాల్ వ‌ర్మ ఏంచేసినా అది సంచ‌ల‌న‌మే. త‌న సినిమా ప్ర‌మోష‌న్ కోసం ఎల్ల‌ప్పుడూ వినూత్నంగా ఆలోచించే వ‌ర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా 29 విడుద‌ల అవుతుండ‌టంతో మ‌రింత జోష్ పెంచారు. డ‌బ్బులు ఖ‌ర్చు కాకుండా త‌న మాట‌లు, వ్యాఖ్య‌ల‌తోనె సినిమాల‌ను ప్ర‌మోష‌న్ చేస్తూ సినిమాపై అంచానాలు పెంచ‌డంలో దిట్ట‌. సినిమా ప్ర‌మోష‌న్ కోసం చివ‌ర‌కి ఆమెరికా అధ్య‌క్షుడు ట్రంప్‌ను కూడా వాడేసుకున్నాడు. ఎన్నికలు ముగిసేంత వరకూ అడ్డుకోవాలని తెలుగుదేశం నేతలు భావిస్తుండగా, సినిమా అదే రోజు కచ్చితంగా విడుదలవుతుందని చెబుతున్న వర్మ డొనాల్డ్ ట్రంప్ సినిమాపై స్పందించారంటూ ఓ మార్ఫింగ్ వీడియోను ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు.

ఇప్పటికే వరుస ఇంటర్య్వూలతో హల్‌చల్‌ చేస్తున్న ఆర్జీవీ. సోషల్‌ మీడియాలోనూ తనదైన స్టైల్‌లో సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు. తన సినిమా ప్రమోట్ సీఎం చంద్ర‌బాబునుకూడా వ‌ద‌ల్లేదు. గురువారం రాత్రి చంద్రబాబు నాయుడు తన మనవడ్ని ఎత్తుకున్న ఫోటోను ట్వీట్ చేసిన వర్మ ‘ఈ 29న మీ కుటుంబంతో కలిసి లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా చూడండి’ అంటూ కామెంట్ చేశాడు.ఈ ట్వీట్ పై ఓ అభిమాని ఆసక్తికరంగా స్పందించాడు. ‘నా కథ నన్నే చూడమంటున్నాడు. కాదండి.. బాధ ఉండదండి’ అంటూ వర్మకు రిప్లై ఇచ్చాడు. ఈ రిప్లైని రామ్‌ గోపాల్‌ వర్మ రీ ట్వీట్‌ చేశాడు. ఇప్పుడు ఈ రెండు వీడియోలు సామాజిక మాధ్య‌మాల్లో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -