Thursday, March 28, 2024
- Advertisement -

ఆకాష్ పూరి రొమాంటిక్ మూవీ లో రమ్యకృష్ణ.. !

- Advertisement -

బాహుబలి సినిమాతో చాలా మంది క్రేజ్ వచ్చింది. అందులో ముఖ్యంగా రమ్యకృష్ణ పోషించిన శివగామి పాత్రకు. ఆమె కనబరిచిన నటన అద్భుతం. దాంతో ఆమెకు అన్ని భాషల్లో అవకాశాలు వస్తున్నాయి. బాహుబలి సినిమాకు ముందు పెద్దగా ఛాన్సులు రాలేదు. నరసింహా సినిమాలో నీలాంబరి గా నటించి అదరగొట్టింది. ఆ తర్వాత ఆ స్థాయిలో గుర్తింపు తెచ్చే పాత్రలో ఆమె నటించలేదు.

ఇప్పటి బాహుబలితో మళ్లీ ఆ స్థాయిని దక్కించుకుని వసరస ఆఫర్స్ ను సొంతం చేసుకుంటుంది. అయితే పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరి హీరోగా అనిల్ పాడురి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న చిత్రం రొమాంటిక్. ఈ సినిమాలో రమ్య కృష్ణ కీలకపాత్రలో నటిస్తోంది. ఈ సినిమాని దర్శకుడు పూరి జగన్నాథ్ నిర్మిస్తున్నాడు. ప్రజేంట్ ఈ సినిమా షూటింగ్ గోవాలో జరుగుతోంది. అక్కడ హీరో, హీరోయిన్, మరియు రమ్యకృష్ణ కపై వచ్చే ముఖ్యమైన సీన్స్ ను షూట్ చేస్తున్నారట. అలానే రెండు సాంగ్స్ ని కూడా చిత్రీకరించనున్నారు.

దాదాపు నెల పాటు గోవాలోనే షూటింగ్ జరుపునే ఈ సినిమా ఆకాష్ కు రెండో చిత్రం. మొదటి చిత్రం మోహబూబా ప్లాప్ అయింది. ఇక ఈ సినిమాలో రమ్యకృష్ణ పాత్ర చాలా బాగుంటుందని.. అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి సినిమాలో రవితేజ, జయసుధ లాగే ఈ సినిమా ఆకాష్, రమ్యకృష్ణ మధ్య సీన్స్ ఉంటాయని తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -