Friday, April 19, 2024
- Advertisement -

రానా బాబు ఎందుకింత తొందర చేస్తున్నాడు?

- Advertisement -

రానా దగ్గుబాటి.. నటుడిగా నే కాకుండా సినిమా కి సంబందించిన మిగిలిన అన్ని క్రాఫ్ట్స్ లో తనకంటూ ఉన్న నైపుణ్యాన్ని ఏదో విధం గా వాడుతూ నే ఉంటాడు. అందుకే మల్టీ టాలెంటెడ్ అనే పేరు ని కెరీర్ తొలి దశ లో నే అందుకున్నాడు రానా. అయితే ఈ మధ్య చూస్తే రానా పేరు నటుడి గా కంటే నిర్మాత గా ఎక్కువ వినిపిస్తుంది. కొత్త వాళ్ళు చేసే సినిమాలని కొని సురేష్ ప్రొడక్షన్స్ నుంచి విడుదల చేసే విధానం ని అమల పరచడమే కాకుండా సొంతం గా కథలు సెలెక్ట్ చేసి యువ దర్శకుల తో డైరెక్ట్ చేయిస్తున్నాడు. త్వరలో నే ఒకటి రెండు సినిమాలు విడుదల కి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది.

అయితే ఇంతే కాకుండా హిందీ, తమిళం, మలయాళం లో కూడా రానా చురుకుగా పాల్గొంటూ వేరే ప్రొడక్షన్ సంస్థ ల తో చేతులు కలుపుతూ కొత్త సినిమాలు నిర్మిస్తున్నాడు. అయితే రానా ఎందుకు ఇంత తొందర పడుతున్నాడు అంటే ఒకటే కారణం. గత కొన్నేళ్లు గా సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి పెద్దగా సినిమాలు రావడం లేదు. ఒక సంవత్సరం నుంచి మాత్రమే సినిమాల ని ఎక్కువ గా పుష్ చేస్తున్నారు వీళ్ళు.

అందుకనే రానా తమ సంస్థ కి పూర్వ వైభవం తీసుకొని రావాలని, ముందుండి నడిపిస్తున్నాడు. ప్రాజెక్ట్స్ సెట్ చేయడం వరకు రానా భాద్యత. ఆ తర్వాత సురేష్ బాబు తన చిన్న కుమారుడి తో కలిసి సినిమాలని పూర్తి చేసి విడుదల చేస్తారట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -