Tuesday, April 23, 2024
- Advertisement -

కిడ్నీ కోసం కాదు, హిరణ్యకశిపుడు కోసం

- Advertisement -

యువ హీరో రానా దగ్గుబాటి ఎక్కడ ఉంటె అక్కడ సందడి పక్కాగా ఉంటుంది అని చెప్పడం లో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. అయితే రానా ప్రస్తుతం ఇండియా లో లేడు. అతను చేస్తున్న సినిమాల కి సంబందించిన కీలక షెడ్యూల్స్ అన్నిటినీ పూర్తి చేసుకొని అమెరికా పయనమయ్యాడు రానా. అయితే అమెరికా ఎందుకు వెళ్ళాడు అనే ప్రశ్న అందరిలో మెదలాగా మన మీడియా కొంత అత్యుత్సాహం ప్రదర్శించి ఎప్పటి లాగానే రానా కి కిడ్నీ సమస్య ఉంది కాబట్టి ఆ సర్జరీ నిమిత్తం వెళ్ళాడు అనే రూమర్స్ వచ్చాయి. అయితే ఇన్ని రోజులుగా మౌనం పాటించిన రానా ఈ మధ్య దీని పై కాస్త ఘాటుగా స్పందించాడు.

ఒక జాతీయ దిన పత్రిక కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఈ ప్రస్తావన రాగా, తన అమెరికా పర్యటన వెనుక గల రహస్యాన్ని చెప్పాడు రానా. నిజానికి తాను తన తదుపరి చిత్రం హిరణ్యకశిప కి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ మరియు వీఎఫ్ఎక్స్ వ్యవహారాల గురించి అక్కడ కొంత మంది తో చర్చలు జరపడానికి వెళ్ళాడట. ఇదే విషయం చెప్తూ, కిడ్నీ వ్యాధి గురించిన వార్తలు విని విని విసిగిపోయానని కూడా చెప్పాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -