Thursday, April 25, 2024
- Advertisement -

పెళ్లి చేసుకోబోతున్న రానా.. అమ్మాయి ఎవరంటే ?

- Advertisement -

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‍లర్ లలో రానా దగ్గుబాటి ఒకరు. అయితే రానా ఏ ఇంటర్వ్యూకి వెళ్లిన.. ఎక్కడ కనిపించినా మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అనే ప్రశ్న లేకుండా ఉండదు. మరికొంత మంది అయితే.. మీరు ప్రేమలో ఉన్నారా ? ఎవరుతో డేటింగ్ లో ఉన్నారు ? అని కూడా అడుగుతారు. ఇప్పుడు అలాంటి ప్రశ్నలన్నింటికీ పుల్‌స్టాప్ పడుతోంది.

ఎందుకంటే రానా పెళ్లి చేసుకోబుతున్నాడు. ఈ విషయంను రానానే స్వయంగా ప్రకటించి అందర్నీ సర్ ఫ్రైజ్ చేశాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. తన గర్ల్‌ఫ్రెండ్ మిహీకా బజాజ్‌ను తాను పెళ్లాడబోతున్నట్టు రానా తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో వెల్లడించారు. మిహీకాతో తీసుకున్న ఒక ఫొటోను కూడా షేర్ చేశారు. ‘ఆమె యస్ చెప్పింది’ అనే క్యాప్షన్‌ను ఈ ఫొటోకు పెట్టారు. అయితే, తమ పెళ్లి ఎప్పుడు?, ఎంగేజ్‌మెంట్ ఎప్పుడు చేసుకుంటారు? వంటి విషయాలను మాత్రం రానా ఇంకా చెప్పలేదు.

కేవలం తనకు పార్ట్‌నర్ దొరికిందని మాత్రమే స్పష్టం చేశాడు. మిహీకా బజాజ్ డ్యూ డ్రాప్ డిజైన్ స్టూడియో‌ను నడుపుతున్నారు. ఇదొక ఈవెంట్ కంపెనీ. గొప్పగొప్ప వాళ్ల ఇళ్లలో ఈవెంట్లను ఈ కంపెనీ డిజైన్ చేస్తూ ఉంటుంది. అయితే, ఈ అమ్మాయి గురించి పెద్దగా ఎవరికీ పరిచయం లేదు. ఇప్పుడు అకస్మాత్తుగా ఈమెతో ఎంగేజ్‌మెంట్ గురించి రానా ప్రకటించడంతో అంత ఆశ్చర్యానికి గురయ్యారు. ఆఖరికి సినీ తారలు సైతం సర్‌ప్రైజ్ అయ్యి రానాకు అభినందనలు తెలుపుతున్నారు. సమంత, శృతిహాసన్, కియారా అద్వానీ, ఈషా రెబ్బా, ఉపాసన కొణిదెల, హన్సిక, స్వప్నా దత్, తమన్నా తదితరులు రానాకు ఇన్‌స్టాగ్రామ్‌లో అభినందనలు తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -