Wednesday, April 24, 2024
- Advertisement -

మళ్ళీ బరువు తగ్గిన రానా, కారణం ఇదే

- Advertisement -

రానా దగ్గుబాటి కి భారతీయ చలన చిత్ర పరిశ్రమ లో ఉన్న రిలేషన్స్ ఇంకో నటుడికి లేవు. చిన్నప్పటి నుంచి సినిమా వాతావరణం లో పెరిగి, సినిమాల మధ్య తిరుగుతూ తను కూడా నటుడయ్యాడు. అంతే కాకుండా ఒక నిర్మాత గా మంచి సినిమాలని ప్రేక్షకులకి అందించాలనే తపన తో పని చేస్తుంటాడు రానా. అయితే ఈ మధ్య కాలం లో రానా ఆరోగ్యం గురించి చాలా రూమర్స్ వస్తున్నాయి. ఎన్టీఆర్ బయోపిక్ కోసం బరువు తగ్గిన రానా, ఆ వెంటనే మళ్ళీ బరువు పెరిగాడు. కాకపోతే ఈ మధ్య మళ్ళీ సన్నగా అయిపోయినట్టు కనిపిస్తున్నాడు.

చాలా మంది ఇంతకు ముందు లాగానే రానా కి కిడ్నీ సంబంధిత వ్యాధి ఉందని, అందుకే ఆరోగ్యం పరం గా సతమతమవుతున్నాడని ప్రచారం చేస్తున్నారు. ఈ విషయమై రానా ఒక తాజా ఇంటర్వ్యూ లో నోరు విప్పాడు. నిజానికి తన ఆరోగ్యం చాలా బాగుంది అని, తాను ఎటువంటి సమస్యలని ఎదురుకోవడం లేదని, హాథీ మేరె సాథీ సినిమా షూటింగ్ కోసమే బరువు మరలా తగ్గాల్సి వచ్చిందని వివరణ ఇచ్చాడు.

తెలుగు లో రానా ప్రస్తుతం విరాట పర్వం అనే సినిమా షూటింగ్ తో బిజీ గా గడుపుతున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -