అనారోగ్యం పై రానా రియాక్షన్ ఇది

258
Rana Daggubati React in Twitter on Kidney Transplant
Rana Daggubati React in Twitter on Kidney Transplant

గత కొన్ని రోజులు గా ట్విట్టర్ లో రానా దగ్గుబాటి ఆరోగ్యం గురించి చాలా వార్తలు వస్తున్న సంగతి మనకి తెలిసిందే. రానా కిడ్నీ సమస్యల తో బాధ పడుతున్నాడని, అమెరికా వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాడని వార్తలు వస్తున్న నేపథ్యం లో ఒక అభిమాని రానా ని ఇదే విషయం మీద స్పందించమని అడుగగా, రానా ఇచ్చిన సమాధానం అందరినీ ఆశ్చర్యపరిచింది. అనవసరం గా ఇలాంటి వార్తలకు స్ట్రెస్ తీసుకోవద్దు అని రానా అభిమానికి సజెస్ట్ చేసాడు.

రానా దగ్గుబాటి ట్విట్టర్ లో ఇస్మార్ట్ శంకర్ సినిమా గురించి షేర్ చేసి చిత్ర యూనిట్ కి అభినందనలు చెప్పినప్పుడు అభిమాని ఒకరు రానా ని తన ఆరోగ్యం గురించి అడిగాడు. “నాకు తెలుసు నువ్వు ఆరోగ్యం గా, మంచిగా నే ఉన్నావు అని. కానీ పుకార్లు అన్నీ చూస్తుంటే లోపల ఏదో తెలియని వెలితి ఉంది. నువ్వు ఆరోగ్యంగా నే ఉన్నాను అని చెప్పు ప్లీజ్.” అన్నాడు ఒక అభిమాని. దానికి రానా తెలివిగా సమాధానం ఇచ్చాడు.

అభిమాని కోరిన విధంగా కాకుండా రానా తన స్టైల్ లో ఆన్సర్ ఇచ్చాడు. “అనవసరం గా స్ట్రెస్ అవ్వద్దు. రబ్బిష్ వార్తలకు రియాక్ట్ అవ్వద్దు.” అన్నాడు.

Loading...